కొడుకు కోసం అలా ప్లాన్ చేసిన‌ మహేష్.. ఎంతైనా నువ్వు సూపర్ బాసు..

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ లకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక నమ్రత సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటు మహేష్ బాబుతో పాటు తరచుగా తన ఫ్యామిలీ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే మహేష్ కూతురు సితార కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని క్రేజీ సెలబ్రిటీగా దూసుకుపోతుంది. చిన్న వయసులోనే పలు యాడ్ లలో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక మహేష్ కొడుకు గౌతమ్ విదేశాల్లో చదువుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తమ పిల్లల గురించి అలాగే మహేష్ గురించి ఎలాంటి మంచి విషయం జరిగిన నమ్రత సోషల్ మీడియాలో వెంటనే షేర్ చేస్తుంది.

Mahesh Babu's son Gautam turns 17, Namrata says this birthday will be  special - Hindustan Times

ఈ నేపథ్యంలో తాజాగా న‌మ్ర‌త తన కొడుకు గౌతమ్ గురించి ఎమోషనల్ పోస్టు షేర్ చేసుకోగా.. కొద్ది నిమిషాల్లోనే 83 వేలకు పైగా లైక్స్ సంపాదించింది. ఇక విషయం ఏంటంటే ఇకపై గౌతం ఘ‌ట్టమనేని ఫ్యామిలీకి దూరంగా ఉండబోతున్నాడు.. గౌతం ఉన్నత చదువుల కోసం న్యూయార్కు వెళ్ళబోతున్నాడు.. న్యూయార్క్ యూనివర్సిటీలో గౌతం కొత్త చాప్టర్ స్టార్ట్ కాబోతుంది అంటూ నమ్రత తన పోస్టులో షేర్ చేసుకుంది. అంతేకాకుండా నీ హార్డ్ వర్క్, ప్యాష‌న్, డిటర్మినేషన్ చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అంటూ రిసుకొచ్చింది. నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగాలి గౌతమ్ అని కొడుకు గురించి నమ్రత తన పోస్టులో వివ‌రించింది.

Mahesh Babu's wife Namrata Shirodkar pens an emotional note showering heaps  of praise on son Gautam for passing 10th exams | Telugu Movie News - Times  of India

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ పోస్టులో నమ్ర‌త‌ గౌతమ్ ఏం చదవడానికి వెళ్తున్నాడు అనే అంశాన్ని మెన్షన్ చేయలేదు. ఇక కొడుకు ఉన్నత స్థానాల్లో ఉండడం కోసమే మహేష్ బాబు ఇలా ప్లాన్ చేశాడని.. న్యూయార్క్ యూనివర్సిటీలో చదువుకుంటే గౌతం కు తిరిగి ఉండదనే ఉద్దేశంతోనే ఇష్టంలేక పోయిన అంత దూరం పంపి చ‌దివిస్తున్నాడ‌ని.. ఫ్యామిలీకి దూరంగా ఉన్న అతని కెరియర్ బాగుంటుందనే ఉద్దేశంతోనే మహేష్ ఇలా ప్లాన్ చేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో కొంతమంది గౌతమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్తుండగా.. మరి కొంతమంది కొడుకు కోసం మీ ప్లాన్ సూపర్ బాసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ” గుంటూరు కారం ” షూటింగ్‌లో బిజిగా ఉన్నాడు.