రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా కోసం ఒక్క ప్రభాస్ అభిమానులే కాకుండా ఆడియన్స్ కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
ఎన్నో అంచనాలు నడుమ రాబోతున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ టికెట్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నట్లు సమాచారం. సలార్ టికెట్స్ మన దగ్గర మాత్రమే కాకుండా యూఎస్ మార్కెట్లో కూడా భారీ మొత్తంలో అమ్ముడుపోతున్నాయి.
ఇక ఒక్క యుఎస్ మార్కెట్ నుంచే ఈ సినిమాకి ఏకంగా 50 వేలకి పైగా టికెట్లు తెగినట్లుగా డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. అంతేకాకుండా రెండో ట్రైలర్ వచ్చాక ఒక్కరోజులో 2 లక్షల డాలర్ల కి పైగా బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఇక వీటితో ఈ మూవీపై ఏ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.