జబర్దస్త్ సత్య శ్రీ కి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందా… మరీ ఎప్పుడు బయటపడక పోవడానికి కారణమేంటి…!!

జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీని దక్కించుకున్నారు. ఈ షో నుంచి కొందరు డైరెక్టర్లు గాను, హీరోలుగాను ఎదిగిన వారు సైతం ఉన్నారు. జబర్దస్త్ కామెడీ షో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా గొప్ప ఎంటర్టైన్మెంట్ నే అందించిందని చెప్పాలి. ఇక ఈ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సత్య శ్రీ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ కి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉందంటూ చెప్పింది.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సత్య శ్రీ కి లెజెండ్ సినిమాతో పేరు వచ్చిన సంగతి తెలిసిందే. ఈమె అనేక సినిమాలలో నటించింది. ఇక రవితేజ హీరోగా తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమాలో కూడా ఈమె నటించింది. ఇక ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు చాలా కష్టమైన సినిమా ఇది అని.. ఈమెకి ఈ సినిమాలో మంచి పాత్ర దక్కిందని సత్య శ్రీ పేర్కొంది. ఇక ఈమెకి డాన్స్ రాకపోవడంతో బంగార్రాజు సినిమాలో అవకాశాన్ని వదులుకున్నట్లు కూడా తెలిపింది సత్య శ్రీ.

2014లో పదవ తరగతి పూర్తి చేసిందట సత్య శ్రీ. ఇక ఈ ముద్దుగుమ్మ అసలు ఊరు కాకినాడ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఈమె అమ్మమ్మ.. ప్రజల కోసం పార్టీ తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా చాలామందికి ఉపాధిని కల్పించినట్లు పేర్కొంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమెకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని ఇప్పుడే బయటపడింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.