సాయి పల్లవి ఈ పేరుకి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . మలయాళీ బ్యూటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఫిదా సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . అందరి హీరోయిన్స్ అందాలను చూపించి అవకాశాలు దక్కించుకుంటే ..ఈమె సిన్సియారిటీ డెడికేషన్ చూపించి అవకాశాలు దక్కించుకుంటుంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది .
ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ కొన్ని కొన్ని సినిమాలకు కమిట్ అవుతూ వస్తుంది . రీసెంట్గా సాయి పల్లవి తమిళంలో రెండు తెలుగులో రెండు సినిమాలకు కమిట్ అయింది . అయితే ఇలాంటి క్రమంలోనే సాయి పల్లవి తాను కొత్తగా కమిట్ అయిన సినిమాల కోసం కొత్త కండిషన్స్ పెడుతుందట . ఇప్పటివరకు సినిమాలో వల్గారిటీ అసభ్య పదాలు వాడకూడదని చెప్పే సాయి పల్లవి రీసెంట్గా తన సినిమాకి కమిట్ అవ్వాలి అంటే ముందుగానే వర్క్ షాప్ కూడా చేయాల్సిందే అంటూ చెబుతుందట .
దీనివల్ల ఎలాంటి సీన్స్ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలనే విషయంలో గెటప్ లుక్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి అని సాయి పల్లవి చెప్పుకొస్తుందట . సాధారణంగా ఎవరైనా సరే తమ సేఫ్టీ కోసం కండిషన్లు పెట్టుకుంటారు. సాయి పల్లవి మాత్రం తన సినిమా బాగా ఆడాలని కండిషన్స్ పెడుతుంది . ఇంతకంటే ఒక హీరోయిన్ కి కావలసింది ఏముంది అంటున్నారు జనాలు..!!