చైతుకి బిగ్ షాక్ ఇచ్చిన శోభితా… హోటల్లో అతడితో అడ్డంగా దొరికేసిందిగా..!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక గత ఏడాది నుంచి నాగచైతన్య తో ఎఫైర్ నడుపుతోందంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. శోభితతో సన్నిహితంగా ఉంటాడు చైతు. ఈమెను తరచుగా కలుస్తూ కూడా ఉంటాడట. ఇక కొన్ని రోజుల క్రితమే చైతు, ఈ ముద్దుగుమ్మ కలిసి తిరుగుతున్నట్లు ఓ ఫోటో బయటకు వచ్చింది.

ఇందులో ఇద్దరు పక్కపక్కన నిల్చుని కనిపించడంతో అంతా నిజమేనేమో అనుకున్నారు. లండన్ వెళ్లిన నాగచైతన్య, శోభిత.. ఇండియన్ రెస్టారెంట్ ని సంప్రదించారు. అందులో పని చేసే చెఫ్, నాగచైతన్య సెల్ఫీ దిగారు. ఈ ఫోటోలో శోభిత కూడా కవర్ అయింది. ఇక దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు షికారు చేశాయి.

ఇక తాజాగా శోభిత ముంబైలో ఓ రెస్టారెంట్ నుంచి ఓ యువకుడితో అడ్డంగా దొరికిపోయింది. ఇద్దరూ బయటకు వస్తుండగా శోభితను మీడియా చుట్టుముట్టింది. అయినప్పటికీ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ జంట. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.