టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . మల్లార్ సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులోకి ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . నో ఎక్స్పోజింగ్-నో వల్గారిటీ- నో బూతు.. మూడు లైన్స్ ని ఎక్కువగా ఫాలో అయ్యే సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుంది .
అంతేకాదు సాయి పల్లవి ప్రెసెంట్ తెలుగులో రెండు సినిమాలు కోలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తుంది. రీసెంట్గా సాయి పల్లవి కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి చిన్నతనంలో తాను చేసిన నాటి అల్లరి గురించి బయట పెట్టింది . బాల్యంలో తల్లిదండ్రులతో వింత వాదన పెట్టుకునేది అంటూ ఇంటర్వ్యూలో బయట పెట్టేసింది . ” తాను తెల్లగా ఉన్నాను మీరు డస్కీ స్కిన్ తో ఉన్నారు నన్ను దత్తత తీసుకున్నారా..? అని అడిగేదాన్ని” అంటూ నవ్వుతూ చెప్పకు వచ్చింది.
“నువ్వు నీ చెల్లి ఒకేలా ఉన్నారు ..మీరు ఇద్దరు మాకే పుట్టారు ” అని పేరెంట్స్ చెప్పే వారని కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే చిన్న ఏజ్ లో ఇలాంటి రకరకాల ఫన్నీ క్వశ్చన్స్ అందరూ అడుగుతూనే ఉంటారు . మనలో కూడా చాలామంది మన పేరెంట్స్ ని అదే విధంగా తిక్క తిక్క క్వషన్స్ వేసి విసిగిచ్చుంటాం. కాగా ప్రజెంట్ సాయి పల్లవి చైతుతో తండేల్..రనబీర్ తో రామాయణం.. నవీన్ పోలితో మాలీవుడ్ ఫిలిం.. శివకీర్తికేయతో కోలీవుడ్ ఫిలిం చేస్తుంది. యూనిక్ కంటెంట్ కలిగిన ఈ నాలుగు చిత్రాలు కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అంటున్నారు మేకర్స్ . అయితే చాలామంది సరదాగా ఫన్నీగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ ను నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు..!!
సాయి పల్లవి వాళ్ల అమ్మ – నాన్నకి పుట్టలేదా..? దత్తత తీసుకున్నారా..? ఇదేం ట్విస్ట్ రా బాబు..!!
