ఆ విషయంలో తారక్, బన్నీ లను ఫాలో అవుతున్న నితిన్.. ట్రెండ్ సెట్ చేస్తాడా..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస ఫ్లాప్ లతో కెరీర్ లో ఇబ్బందులు పడుతున్నాడు. ఒకప్పుడు 14 ప్లాపులు వచ్చిన తట్టుకొని స్ట్రాంగ్ గా నిలబడిన నితిన్‌.. ఇప్పుడు రెండు, మూడు ఫ్లాప్లకే డీలపడిపోతున్నాడు. ఎందుకంటే ప్లాప్‌ల నుంచి బయటకు వచ్చి మంచి హీరోగా కొనసాగుతున్న ఈ యంగ్ హీరో మరోసారి ప్లాపులు వస్తే అంతకుముందు లాగే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆలోచిస్తున్నాడట. అయితే ఇప్పటికే నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో భారీ డిజాస్టర్ ను చెవి చూశాడు. ఇక ప్రస్తుతం నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 

ఇప్పటికే వీళ్ళ కాంబోలో భీష్మ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమాతో నితిన్ కి కూడా బాగా పాపులారిటీ దక్కింది. ఇప్పుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో నటిస్తున్న సినిమాలో నితిన్ పంతులు క్యారెక్టర్ లో నటిస్తున్నాడని టాక్. అయితే సినిమా మొత్తం అదే క్యారెక్టర్ ఉంటుందా..? లేదంటే కొంత భాగం మాత్రమే పంతులుగా ఉండి మిగతా సినిమాలో వేరియేషన్స్ చూపిస్తాడా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఇప్పటికే పంతులు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ నటించి వాళ్ళ న‌ట‌న‌తో త‌మ‌కంటూ ఓ ప్రత్యేకమైన మార్క్‌ క్రియేట్ చేసుకున్నారు.

ఇక నితిన్ కూడా పంతులు క్యారెక్టర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్‌ క్రియేట్ చేసుకోవాలని.. ఈ సినిమాతో ఎలాగైనా ట్రెండ్ సెట్ చేయాలని ఫీలవుతున్నాడట. అయితే ఈ సినిమాతో నితిన్ సక్సెస్ అవుతాడా..? లేదా..? అనే విషయంపై ఇండస్ట్రీలో చాలా సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ కొంచెం అటు ఇటు అయితే ఎన్టీఆర్, బన్నీ నటనలతో పోలుస్తూ నితిన్ ఎన్నో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ ని ఎంచుకున్న ఈ యంగ్ హీరో తను నటన విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏదైనా డిస్టబెన్స్ వచ్చినట్లయితే మొదటికే మోసం వస్తుందటంలో సందేహం లేదు. ఇక నితిన్ తన నటనతో వీరి కాంబో మూవీ భీష్మ సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.