ద్యావుడా..సలార్ లో కనిపించిన ఈ అమ్మాయి ఎవరి కూతురో తెలుసా..? కళ్ళు చెదిరిపోయే బ్యాక్ గ్రౌండ్..!

టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమా సలార్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కోట్లాదిమంది జనాలు ఎప్పుడు ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా ..ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ వేయి కళ్లతో ఎదురు చూశారు . ఫైనల్లి ఆ మూమెంట్ రానే వచ్చేసింది . డిసెంబర్ 22న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన టాక్ మొత్తం పాజిటివ్ గా ఉండడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి .

కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి క్రమంలోనే సినిమాలో నటించిన నటీనటుల డీటెయిల్స్ ట్రెండ్ చేస్తున్నారు జనాలు. ప్రభాస్ సలార్ సినిమాలో నటించిన ఈ పాప ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది . సలార్ సినిమాలో సురభి క్యారెక్టర్ లో చాలా అద్భుతంగా నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

ఈ పాపకి ఇది మొదటి సినిమా కాదు గతంలో కూడా చాలా యాడ్స్ లో మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది . సలార్ సినిమాలో నటించడానికి ముందు ఓరి దేవుడా సినిమాతో పాటు ఝాన్సీ అనే వెబ్ సిరీస్ లో నటించింది . రెండేళ్ల వయసులోనే ఐపిఎల్ తో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమోలో కూడా ఫర్జనా కనిపించింది. ఆమె బ్యాక్ గ్రౌండ్ చాలా వెల్ సెటిల్ ఫ్యామిలీ అయినా సరే అమ్మడు తన ప్యాషన్ కారణంగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటూ అనుకునింది.

పలు స్కూల్ యాడ్స్ లో నటించడం కోసం మోడల్స్ వరల్డ్ ఏజెన్సీ నుండి ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడే ఆమె ను సెలెక్ట్ చేసుకున్నారు. సురభి పాత్ర కోసం దాదాపు 100 మంది ఆడిషన్ ఇచ్చారట. కానీ ఫైనల్లీ ప్రశాంత్ నీల్ సురభి పాత్ర కోసం ఫర్జనా నే ఓకే చెప్పారు . ఈ పాత్రలో ఈమె లీనమైపోయి నటించిన ఎమోషన్ చూస్తే ఖచ్చితంగా కళ్ళల్లో నీళ్లు తిరగడం పక్క . ప్రెసెంట్ ఫర్జనా కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి..!!