సలార్ సినిమాలో నటించిన ఈ కుర్రాడు ..ఆ టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు అనే సంగతి మీకు తెలుసా..?

సలార్ సినిమా ..రీసెంట్గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకున్న విషయం తెలిసిందే . ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించి సంచలనాన్ని క్రియేట్ చేసింది . ఈ క్రమంలోనే సినిమాలో నటించిన నటీనటులకు సంబంధించిన విషయాలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . కాగా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక ఫేస్ మాత్రం బాగా బ్లింక్ అవుతుంది. ఆ కుర్రాడే పృధ్విరాజ్ చిన్నప్పటి పాత్రలో మెరిసిన అబ్బాయి .

ఎక్స్ప్రెషన్స్.. హావభావాలు ఆ నటన నిజంగా చాలా చాలా బాగా నటించాడు . ఆ పాత్రకు ఆ అబ్బాయి కరెక్ట్ అంటూ ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయిపోయి మరి ఆయన చూస్ చేసుకున్నాడు . ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో తెలుసా ..? మన టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ కి కొడుకు వరస అవుతాడు . రవితేజ కి కజిన్ బ్రదర్ కొడుకు ఈ అబ్బాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఈ అబ్బాయి పేరు కార్తికేయ దేవ్. పదవ తరగతి చదువుతున్నాడట . ఈ సినిమాలో పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేయగా చివరికి కార్తికేయ దేవ్ ని తీసుకున్నాడు . ప్రశాంత్ నీల్ పాత్రకు తగిన న్యాయం చేసి సూపర్ డూపర్ తన హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు . సలార్ సినిమా ఫస్ట్ డే దాదాపు 175 కోట్లు మార్క్ దాటేసింది..!!