బాలయ్య ” ఆదిత్య 369 ” సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. యంగ్ హీరోయిన్లు కూడా ఆమె ముందు బ‌లాదూరే..!!

నటి మోహిని అంటే ఈ తరం ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ బాలయ్య నటించిన ” ఆదిత్య 369 ” సినిమాలో హీరోయిన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే తెలుగులో సైతం బాలయ్యకి జోడిగా నటించి ఫుల్ పాపులారిటీని పొందింది. ఇక తెలుగు, మలయాళ, తమిళ్ కలిపి దాదాపు 100కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఈమెది బ్రాహ్మణ కుటుంబం. ప్రస్తుతం ఈ బ్యూటీ క్రైస్తవ మతాభిమాని. అయితే తాజాగా మోహిని తన నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర ఘటనలను వెల్లడించింది. తనకి ఎవరో చేతబడి చేశారని.. తనను ఏసుప్రభువు కాపాడాడని.. అలాగే ఈమెకి పెళ్లయిన ఐదు సంవత్సరాలకి అనేక మానసిక సమస్యలు వచ్చాయని.. కొన్ని సందర్భాలలో నేను ఏం చేసేదానినో నాకే తెలిసేది కాదు. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసినట్లు చెప్పుకొచ్చింది.

ఇక దీంతో ప్రముఖ జ్యోతిష్యుడీని కలుస్తే ఆయన ఈమెకి చేతబడి చేశారని చెప్పాడని.. ఎన్నో పూజలు, పునస్కారాలు చేసిన ఎటువంటి ఫలితం కలగకపోవడంతో.. ఏసుప్రభువును నమ్ముకున్నట్లు తెలియజేసింది. అనంతరం ఈమెకి ఎటువంటి సమస్యలు రాలేదంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈమెని చూస్తే చాలా బొద్దుగా తయారయింది. అస్సలు పోలికలే లేకుండా పోయాయి. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ హీరోయిన్లని సైతం తలదన్నేలా ఉండేది.. కానీ ఇప్పుడు మాత్రం చాలా లావుగా తయారైంది.