శంకర్ దాదా MBBS లో రీల్‌ టాపర్‌.. రియ‌ల్ లైఫ్‌లో కూడా సివిల్ టాపర్ ఆ…!!

చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా MBBS సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో పండించిన కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో నటించిన ఓ నటుడు ఒక సివిల్స్ టాపర్ అని మీకు తెలుసా? అతనెవరో ఇప్పుడు మనం చూద్దాం.

ఈ సినిమాలో నటించిన నటుడు యెడవెల్లి అక్షయ్ కుమార్ ఒక సివిల్ టాపర్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పలు ఆసక్తికర కామెంట్లు చేశాడు. ” నేను సివిల్స్ టాపర్గా నిలిచినప్పటికీ సైడ్ ట్రాక్ వల్లే సినిమాలు బాగా చూసేవాడిని.

వారానికి ఒక సినిమా అయితే పక్కా చూసేవాడిని. నేను సినిమాలు చూస్తానని మా ఫాదర్ కి అస్సలు తెలియదు. నేను చూసేవి కొన్ని సినిమాలు మాత్రమే. అవి కూడా డీసెంట్ గా ఉన్నవి మాత్రమే. అంతేకానీ పిచ్చి పిచ్చి సినిమాలు అస్సలు చూడను ” అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం ఈయ‌న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.