బంపర్ ఆఫర్ కొట్టేసిన రైతు బిడ్డ.. ఏకంగా పవన్ మూవీలో ఛాన్స్‌.. అదృష్టవంతుడువు రా అయ్యా..!!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అద్భుతమైన టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఏ సీజన్లో లేని విధంగా బిగ్ బాస్ ఊహించని టాస్కులు ఇస్తూ.. అదరగొడుతున్నాడు. ఇప్పటికే 12 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 13 వ వారంలోకి అడుగు పెట్టింది. ఇక ఇంటి సభ్యుల్లో పల్లవి ప్రశాంత్ గురించి మనందరికీ తెలిసిందే. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఫుల్ పాపులారిటీని దక్కించుకున్నాడు.

ఇక బయట ఈయన ఫాలోయింగ్ కి హద్దే లేదు. సెలబ్రిటీలు సైతం ప్రశాంత్ ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇందులో భాగంగానే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ను డైలీ ఫాలో అయ్యే వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒకరని తెలుస్తుంది.

కాగా ఈయన ప్రశాంత్ గేమ్ నచ్చడంతో… ఈయన తాజాగా డైరెక్ట్ చేస్తున్న మూవీ ” ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలో ఓ పాత్ర ఇవ్వనున్నట్లు సమాచారం. ఫినాలే ఎపిసోడ్ లో గెస్ట్ గా వచ్చి హరీష్ ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం తెలిసిన ప్రశాంత్ ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.