సేఫ్ గేమ్ ఆడిన ప్ర‌శాంత్.. గౌత‌మ్ ఎలిమినేష‌న్‌.. కార‌ణం అదేనా..

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇంట్ర‌స్టింగ్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరో తెలియడానికి కేవలం ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. కాగా నిన్నటి ఎపిసోడ్ లో డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే దానికి కారణం ఏంటి.. నిన్నటి ఎపిసోడ్లో హైలెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫినాలే టికెట్ తెచ్చుకున్న అర్జున్ ఎలిమినేషన్ నుంచి శనివారం సేఫ్ అయిపోయాడు. కాగా ఈ సీజన్లో విజేతగా గెలిస్తే ఏమేమి ఉంటాయో నాగార్జున ప్రకటించడంతో ఆదివారం ఎపిసోడ్ మొదలైంది.

ఈ సీజన్ విన్నర్‌గా నిలిస్తే రూ.50 లక్షల నగదు తో పాటు.. మారుతి కార్.. జోస్ ఆలుకాస్ నుండి ల‌క్ష‌న‌ర విలువైన డైమండ్ నెక్లెస్ సొంతమవుతాయని నాగార్జున చెప్పాడు. దీంతో ఈ సీజన్ టైటిల్ విన్నర్ కు బాగానే డబ్బు ముట్ట చెప్పబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక వీకెండ్ ఎపిసోడ్ అంటే మొదటి నుంచి వచ్చిన కాన్సెప్ట్ ప్రకారం హౌస్ మేట్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి. కానీ బిగ్ బాస్ టీం దీనికంటే ప్రమోషన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. ప్రమోషన్స్ చేయవచ్చు కానీ ఎపిసోడ్లో ఎక్కడైన‌ ఐదు నిమిషాలు అయితే పర్వాలేదు.

సగం ఎపిసోడ్ ప్రమోషన్స్ కి సరిపోయింది. ఈ ఆదివారం ఎపిసోడ్ లెంగ్త్ ఉండేసరికి చాలా బోర్ కొట్టినట్టు అనిపించింది. నా సామిరంగా, హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన ఆషికా రంగనాథ్, నాని ఊహించిన రేంజ్ లో అయితే ఎంటర్టైన్ చేయలేకపోయారు. సేవింగ్ లో భాగంగా ప్రియాంక, శివాజీ, యావర్ వరసగా ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయిపోయారు. చివరిగా ప్రశాంత్, శోభ, గౌతమ్‌ మిగిలారు. ఇలాంటి టైంలో ఎవిక్షన్ పాస్ ఉపయోగించాల్సిందేనంటు నాగార్జున డిమాండ్ చేశాడు. లేదంటే తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని అన్నాడు.

ఇక్కడ చాలా తెలివిగా ఆలోచించాన‌ని ప్రశాంత్ భావించాడు. కానీ శోభ, గౌతమ్ ఇద్దరికీ ఇచ్చి ఇలాంటి టైంలో బాడ్ అవ్వడం తనకు ఇష్టం లేని ప్రశాంత్ ఈ పాస్ ను ఎవరికీ ఇవ్వనంటూ హీరోలా ఫీలయ్యాడు. అయితే అతని సేఫ్ గేమ్ అందరికీ అర్థమయిపోయింది. ఆ తర్వాత ప్రశాంత్ సేవ్ అయ్యాడు. చివరిగా శోభ, గౌతమ్ లో.. గౌతమ్‌ ఎలిమినేట్ అయ్యాడు. 13వ వారం కావడంతో గౌతం ఎలిమినేట్ అయిన పెద్దగా ఫీల్ అవ్వలేదు. కాగా నిన్నటి ఎపిసోడ్ వీక్షించిన ప్రేక్షకులు అంతా కేవలం పల్లవి ప్రశాంత్ ఆడిన సేఫ్ గేమ్ వల్లే గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు అంటూ ఫైర్ అవుతున్నారు.