ఆతరం అందాల తార సాక్షి… ఇప్పుడు ఇలా మారిపోయిందా… ఇది అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు….!!

హీరోయిన్ సాక్షి శివానంద్ మనందరికీ సుపరిచితమే. ఈమె నటించిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ” మాస్టర్ ” అని సినిమాలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ సినిమా అనంతరం తెలుగులో సీతారామరాజు, యువరాజు, వంశోద్ధారకుడు వంటి అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ ముద్దుగుమ్మ ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో సైతం నటించి అక్కడి వారిని మెప్పించింది. ఇక ఈమె కెరీర్ మంచి రేంజ్ లో ఉన్న సమయంలో ఏమైందో తెలియదు కానీ.. సినిమాల నుంచి తప్పుకుంది. ఇక దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత హూమం అనే సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించి షాక్ ఇచ్చింది.

ఇక ఒకటి ,రెండు సినిమాల్లో కనిపించి అనంతరం మళ్లీ కనుమయ అయ్యింది ఈ బ్యూటీ. ఇక అనంతరం సాగర్ అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈమె సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పి తన భర్త బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటుంది. ఇక ఈ మధ్యకాలంలో ఈమె మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందంటూ వార్తలు వినిపించినప్పటికీ.. అవి నిజం కాలేదు. ఇక ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులని అలరిస్తుంది.