పెళ్లి చూపుల్లో అనుకోకుండా ఆ ఒకే ఒక్క ప్రశ్న అడిగిన ” ఆర్ ఆర్ ఆర్ ” హీరోల భార్యలు…. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ‌. ముఖ్యంగా ఈ సినిమాతో వీరిద్దరూ పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఈ హీరోలు ఇద్దరు సినిమాలోనే కాదు బయట కూడా మంచి స్నేహితులు. కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమా అనంతరం వీరిద్దరి బాండింగ్ మరింత బలపడింది. వీరిద్దరూ ఫ్రెండ్స్ అని కూడా ప్రేక్షకులకి అప్పుడే తెలిసింది. ప్రస్తుతం వీరిపై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వీరిద్దరూ అనుకోకుండా ఒకే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చిందట. ఇక చరణ్, ఉపాసన ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిలది పెద్దలు కుదిర్చిన వివాహం. అయినా కానీ వీరిద్దరూ భార్య విషయంలో ఒకటే సిట్యువేషన్ ఫేస్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. రామ్ చరణ్ ఉపాసనాలు ప్రేమలో ఉన్నప్పుడు.. ఉపాసన చరణ్ ను ఓ టిపికల్ అండ్ లేడీస్ అందరూ అడిగే క్వశ్చన్ అడిగిందట. అదేంటంటే..” పెళ్లి తర్వాత మీరు ఎవరికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు? నాకా? మీ అమ్మకా? అని సరదాగా అడిగిందట.

కామన్ గా ఈ ప్రశ్నను ఆడవాళ్ళందరూ తమకు కాబోయే భర్తను అడుగుతూనే ఉంటారు. అయితే సేమ్ అలాగే పెళ్లి చేసుకోబోయే ముందు ఎన్టీఆర్ ను, లక్ష్మి ప్రణతి కూడా ఇదే ప్రశ్న అడిగిందట. ఈ స్టార్ హీరోస్ కూడా ఆచితూచి కరెక్ట్ గానే సమాధానం ఇచ్చారు. ” ఇద్దరికీ ప్రాధాన్యత ఇస్తాను. అమ్మను బాగా చూసుకునే ప్రతి అబ్బాయి తన భార్యను కూడా బాగానే చూసుకుంటాడు ” అంటూ ఆన్సర్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా వీరిద్దరూ ట్రూ ఫ్రెండ్స్, ఏ జన్మలోను అన్న ,తమ్ముళ్లు అయి ఉంటారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు.