ఆ కారణంగానే నా కంపెనీ మూసేశా.. ఇప్పుడు ప్రపంచంలోనే అది టాప్ కంపెనీ.. రానా..

సినీ పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలుసు. ఇది పెద్ద సినిమా, మీడియం రేంజ్ సినిమా, చిన్న సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ను యూజ్‌ చేస్తూ ఉంటారు. అందుకే ప్రస్తుతం సినీ పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలపై డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇక ఫ్యూచర్లో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ముందే భావించిన రానా తన 18ఏళ్ళ‌కే స్పిరిట్ పేరుతో విజువల్ ఎఫెక్ట్ కంపెనీ ని స్టార్ట్ చేశాడట‌. అయితే కొన్ని కారణాల వల్ల కంపెనీని మూసివేయాల్సి వచ్చిందట.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పుకొచ్చాడు. 2005 లో నేను స్పిరిట్ మీడియా పేరుతో విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని స్టార్ట్‌చేశా.. దాదాపు నేను ఐదేళ్లపాటు ఆ కంపెనీకి పని చేశానని ఎలాగైనా ఆ స్టూడియో ద్వారా ఓ సినిమా చేయాలని ఆశ నాకు ఉండేదని.. కానీ కొంతకాలానికి నేను దాన్ని రన్ చేయలేకపోయానని.. మనకు అందుబాటులో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ చాలా కొత్తవి అందుకే నా కంపెనీ ప్రైమ్ ఫోకస్ వాళ్ళకి అమ్మేశా.. అయితే ఇప్పుడు అదే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ విజువల్ ఎఫెక్ట్ కంపెనీగా ఎదిగింది.

నా కంపెనీ ని అమ్మకానికి పెట్టినప్పుడు నేనేం ఫీల్ అవ్వలేదు.. వ్యాపార నిర్వహణ తెలియనప్పుడు దాని నుంచి తప్పుకోవడమే మంచిదని నేను అనుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం రానా రజినీకాంత్ 107వ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తున్నారు. జై భీమ్ ఫ్రేమ్ టీజే జ్ఞానవెల్ దర్శకత్వంలో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడది పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్గా రిలీజ్ కానుంది.