నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్లను అందుకున్న బాలయ్య ప్రస్తుతం బిజీ లైన్అప్‌తో దూసుకుపోతున్నాడు. ఇక భగవంత్ కేసరి తర్వాత బాలయ్య హీరోగా బాబీ డైరెక్షన్లో ఎన్బికె 109 సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రిలీజ్ అయింది. ఇప్పటికే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మెన్షన్ హౌస్ మందు బాటిల్, మారణాయుధాలు, గన్, డబ్బులు ఇలా కొన్ని వస్తువుల సమ్మేళనంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. లైట్, యాక్షన్, కెమెరా అంటూ బాలకృష్ణ మూవీ షూటింగ్ బుధవారం ప్రారంభించినట్లు అనౌన్స్ చేశారు. నటసింహం, డైరెక్టర్ బాబి ఎన్బికె మూవీ షూటింగ్ స్టార్ట్ అంటూ రాసుకోచ్చారు. ఇక సినిమా షూటింగ్ మొదలైనట్లు చూపించే పోస్టర్‌లో గొడ్డలి, రేబాన్ కళ్ళజోడు ను చూపించి హైలెట్ చేశారు. గొడ్డలిపై స్టైలిష్ గా స్పెట్స్, మెడలో వేసుకునే దేవుడు గొలుసు ఉన్నాయి. ఈ పోస్టర్ చాలా క్రేజీగా ఉంది. సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనే ఆసక్తిని కల్పించే విధంగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు.
ఇక ఆ గొడ్డలి పైన ఉన్న షేడ్స్ ఇద్దరు ఫైట్స్ చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య, సూర్యదేవర నాగావంశం నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్బికె 109 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా మొదలైంది. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ తెలిపారు.