గోపీచంద్ సినిమా చేసినపుడు బాగా తిట్టారు: నటి జయలక్ష్మి!

నటి జయలక్ష్మి గురించి మీరు వినే వుంటారు. చాలా సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి, అత్త పాత్రలు చేసిన ఆమెని మన తెలుగు మహిళలు బాగానే గుర్తు పెట్టుకుంటారు. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. దాంతో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. అవును, గోపీచంద్ రీసెంట్ మూవీ ‘ రామాబాణం ‘ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా ఇండస్ట్రీలో తాను ఎలాంటి పాత్రలు పోషిస్తున్నానో అందరికీ బాగా తెలుసని, కొన్నిసార్లు అజ్ఞానం వల్ల మంచి ఆఫర్లు కోల్పోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయని ఈ సందర్బంగా ఆమె తెలిపారు. ఈ క్రమంలో మెగా హీరో రామ్ చరణ్ సినిమా ఒకటి మిస్ అయ్యానని చెప్పుకొచ్చారు. అయితే గోపీచంద్ రామబాణం సినిమాలో చేయడానికి ఆమె చాలా ఆసక్తి చూపించారట. కానీ కొన్ని కారణాల వలన తిట్లు కూడా తిన్నట్లు చెప్పుకొచ్చారు. రామబాణం సినిమాలో రెండు సీన్లు పూర్తి చేశారట. కానీ గోపీచంద్ కు ఫ్రాక్చర్ అవ్వటం వలన సినిమా డీలే అయిందట. ఆ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయిందని జయలక్ష్మి పేర్కొన్నారు.

అయితే తాను అమెరికా వెళ్లే డేట్ కంటే తర్వాత షూటింగ్ డేట్స్ ఇచ్చారట. కానీ అమెరికా వెళ్తున్న ఈ సమయంలో డేట్స్ ఇస్తే ఎలా అని అడిగితే సీరియస్ అయ్యారని చెప్పుకొచ్చారు. తన పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి కదా అని అడిగితే? ఫారెన్ ట్రిప్స్ వెళ్లే వాళ్లకు సినిమాలు ఎందుకు? అని మొట్టికాయలు వేశారని చెప్పుకొచ్చింది. ఇలా తాను గోపీచంద్ రామబాణం సినిమాలో రెండు సీన్లు పూర్తి చేసినప్పటికీ వాళ్లు నన్ను తిట్టడం చాలా బాధ వేసింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.