వామ్మో.. కలలో కాకి ఇలా కనిపిస్తే అలా జరుగుతుందా..? దాని వెనక ఉన్న లాజిక్ ఇదే..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కలలు వస్తూనే ఉంటాయి. కొంతమంది వాటిని పట్టించుకుంటారు మరికొందరు మాత్రం వాటిని అస్సలు పట్టించుకోరు. సాధారణంగా హిందూ శాస్త్రంలో ఉన్న స్వప్న శాస్త్రం ప్రకారం.. మీ కలలోకి కాకి క‌నుక వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అసలు కాకి కలలోకి ఎందుకు వస్తది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కాకిని కలలో చూడడం అస్సలు మంచిది కాదు.

కానీ కొన్ని ప్రత్యేకమైన కలల్లో మనకు కనిపించిన విధానం ప్రకారం అవి చాలా మంచి కలలుగా పరిగణంలోకి తీసుకోవచ్చు. అదేంటంటే… సాధారణంగా మీ కలలో ఎగురుతున్న కాకిని చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ లైఫ్ లో ఏదో చెడు విషయం జరుగుతుందని అర్థం. రాబోయే రోజుల్లో మీకు చాలా సమస్యలు వచ్చే ముందు ఇటువంటి కలలు వస్తాయి.

ఒకవేళ మీ కలలో కాకులు అన్ని ఒకే చోట కూర్చుని ఉంటే.. రాబోయే రోజుల్లో ఎవరో ఒకరు మరణించడం.. లాంటివి జరుగుతాయి. అలాగే మీ కలలో మాట్లాడుతున్న కాకిని చూస్తే రాబోయే రోజుల్లో మీకు ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా మీకు కలలు వస్తే తప్పకుండా పండితులను సంప్రదించండి. లేదంటే ఏదో ఒక చెడు వార్త వినాల్సి వస్తుంది.