వైరల్ గా మారిన రష్మీక ఫేక్ వీడియో..!!

హీరోయిన్ రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. త్వరలోనే రణబీర్ తో కలిసి నటించిన యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో కూడా పలు సినిమాలలో నటిస్తు బిజీగా ఉన్న రష్మిక పుష్ప చిత్రంతో ఏకంగా పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లోనే కాకుండా మరో నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది.

తాజాగా రశ్మికకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. రష్మిక డీప్ నెక్ బ్లాక్ దుస్తులలో లిస్టులోకి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.ఈ వీడియోలో రష్మిక చాలా ఎక్స్పోజింగ్ చేసినట్లుగా కనిపిస్తోంది.ఈ వీడియో చూసిన అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. రష్మిక ఏంటి ఇలా తయారయ్యి బయటకు వచ్చింది అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది కొంతమంది చూసి ఫేక్ వీడియో అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు.

అయితే ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే ఒక సోషల్ మీడియా అమ్మాయికి సంబంధించిన వీడియో అని ఆమె వీడియోని ఎవరు రష్మిక ఫేస్ తో మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. రస్మిక వీడియో కావడంతో ఇది క్షణాలలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది ఇలాంటి చేసే వారి పైన సైబర్ క్రైమ్ తగిన శిక్ష విధించాలంటూ తెలుపుతున్నారు. ఈ విషయాన్ని అమితాబచ్చన్ కూడా తెలియజేస్తూ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని తెలుపుతున్నారు. రష్మిక మాత్రం ఇంకా స్పందించలేదు.