సాధారణంగా అందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ అదృష్టం మాత్రం ఎప్పుడో కానీ తలుపుతట్టదు. ఎంత కష్టపడినా దానికి తగిన ఫలితం దొరకడం లేదు. అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆ అదృష్టం కలిసి వచ్చేముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో నిపుణులు చెప్పకనే చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొబ్బరి పువ్వు:
ముఖ్యంగా ఇంట్లో పూజలో కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందని సూచన.
2. నల్ల చీమలు:
ఇంటి ఆవరణ దగ్గర నల్ల చీమలు, పక్షుల గూడులు ఉంటే అదృష్టం మీ తలుపు తడుతుందని సూచన.
3. ఆవు ఎదురైతే:
మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లి వచ్చేటప్పుడు ఆవు ఎదురైతే మీకు శుభం జరుగుతుంది.
4. కలలో నెమలి కనిపించడం:
మీ కలలో నెమలి కనిపించిన మీకు ఏదో శుభం జరుగుతుందని సూచన.
5. దీపం నుంచి చప్పుళ్లు వినిపించడం:
ఇంట్లో పెట్టిన దీపం నుంచి చప్పుళ్లు వినిపిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం.
ఈ సంకేతాలు మీకు ఎదురైతే మీరు త్వరలోనే అష్ట ఐశ్వర్యాలతో ఉంటారని అర్థం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అదృష్టం ఏదో వైపు నుంచి వస్తుంది. అలాగే మీ అదృష్టం కూడా ఇటువంటి సంకేతాల నుంచి ఎదురవుతుంది.