టాలీవుడ్ లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ల వారసులు ఎవరంటే..?

ఇండ‌స్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఎంతోమంది నట వర‌సులుగా అడుగు పెడుతూ ఉంటారు. కొంతమంది హీరోల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వ‌గా.. మరి కొంతమంది టాలెంటెడ్ డైరెక్టర్ల కుమారులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వారిలో చాలామంది సక్సెస్ కాగా కొంతమంది మాత్రం ఇంకా సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక కొంతమంది ఎంత ప్రయత్నించినా సక్సెస్ రాకపోవడంతో ఇండస్ట్రీని వదిలిపెట్టారు. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుల కొడుకులు ఎవరు ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఆది పినిశెట్టి :


నిర్మాతగా డైరెక్టర్‌గా ఎన్నో సినిమాలను రూపొందించిన రవి రాజా.. కుమారుడు ఆది పిన్ని శెట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు అటు హీరోగా ఇటు విలన్ గాను ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

అల్లరి నరేష్ – ఆర్యన్ రాజేష్ :


టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ఇవివి సత్యనారాయణ ఎన్నో సినిమాలతో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వారసులుగా ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ టాలీవుడ్‌కి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఆర్యన్ రాజేష్ ఒకప్పుడు టాలీవుడ్ వరుస‌ సినిమాలో నటించినా.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఇక అల్లరి నరేష్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి హీరోగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. కామెడీ సినిమాలు తోనే కాకుండా కొత్త జోనర్ సినిమాలను కూడా ప్రయత్నిస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు.

ఆకాష్ పూరి :


టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి కూడా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రి ఇచ్చాడు. ఈ యంగ్‌ హీరో బుజ్జిగాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.

గోపీచంద్ :


మ్యాచ్ స్టార్ గోపీచంద్ తండ్రి కూడా ఓ డైరెక్టర్ అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కానీ గోపీచంద్ తండ్రి టీ కృష్ణ.. నేటి భారతం, దేశంలో దొంగలు, ప్రతిఘటన లాంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. అంతేకాకుండా ఈ సినిమాలకు ఆయన ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించాడు. డైరెక్టర్ తనయుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన గోపీచంద్ ప్రస్తుతం హీరోగా, విలన్ గా రాణిస్తున్నారు.

సంతోష్ శోభన్ :


టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు అయితే సంతోష్ శోభన్ తండ్రి కూడా ఓ దర్శకుడు వర్షం బాబి రవితేజ చంటి సినిమాలకు డైరెక్టర్గా వ్యవహరించాడు ఇక గతంలో పలు సినిమాల్లో నటించిన సంతోష్ శోభన్ ప్రస్తుతం యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు