వరుణ – లావణ్య రిసెప్షన్ పిక్స్ వైరల్.. విచ్చేసిన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరంటే..?

ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలా వివాహం వైభవంగా ఇటలీలోని టస్కానీలో జరిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుకకు కేవలం మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యారు. ఇక తాజాగా ఈ జంట హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ జరుపుకున్నారు. టాలీవుడ్ ప్రముఖులు, సినీ తారలు ఎంతోమంది ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వేడుకకు హాజరైన అతిధులను, సినీ ప్రముఖులను అందరిని తండ్రి నాగబాబు దగ్గరుండి రిసీవ్ చేసుకున్నాడు. రిసెప్షన్ హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా జరిగింది.

ముఖ్యంగా ఈ వేడుకల్లో హాజరైన వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అరేంజ్మెంట్స్ చేశారు మెగా ఫ్యామిలీ. వేడుకల్లో డెకరేషన్ అందరినీ ఆకట్టుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్, యాక్టర్స్, కమెడియన్స్, టెక్నీషియన్స్ ఇలా ఎంతోమంది హాజరై ఫోటోలకు స్టిల్స్‌ ఇచ్చారు. ఇక ఈ వేడుకల్లో యాక్టర్ ప్రగతి, యాంకర్ సుమ, సుమ కొడుకు ప్రముఖ, నటుడు ట్రైనర్ సత్యానంద్, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అక్కినేని నాగచైతన్య, సునీల్, సుబ్బరాజు, జయసుధ, మురళీమోహన్ ఇలా ఎంతోమంది హాజరయ్యారు.

ఇక కమెడియన్ అలీ కుటుంబ సమేతంగా ఈ వేడుకకు హాజరయ్యాడు. వచ్చిన గెస్ట్‌లు అంతా త‌మ గిఫ్ట్‌లు ఇచ్చి వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక‌ నిన్న మొన్నటి వరకు వ‌రుణ్ – లావణ్య వెడ్డింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ రిసెప్షన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ రిసెప్షన్లో వరుణ్ తేజ్ – లావణ్య ప్రత్యేకంగా డిజైన్ చేయించిన అవుట్ ఫుట్ లో గ్రాండ్ లుక్ లో కనిపించారు. వీరితో పాటే సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ అంతా వేడుకల్లో హాజరయ్యారని సమాచారం. ఇక వేడుక‌లో సంద‌డి చేసిన సెల‌బ్రెటీస్ పిక్స్ మీరు ఓ లుక్ వేయండి.