డబుల్ ఇస్మార్ట్ శంకర్ కోసం సంజయ్ దత్ ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా..?

ఇటీవల స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో రామ్ పోతినేని.. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. ఇప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. హై అటెన్షన్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రానగా తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఈ చిత్రాన్ని సిక్వల్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు.

ఇందులో విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నది. ఈ సినిమా కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. తాజాగా ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సంజయ్ దత్ ఈ సినిమా కోసం 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కే జి ఎఫ్ చాప్టర్-2 చిత్రంలో విలన్ గా అద్భుతమైన నటనను ప్రదర్శించిన సంజయ్ దత్ ఒక్కసారిగా ఈయన మార్కెట్ పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే సంజయ్ దత్ రిమ్యునరేషన్ కూడా పెంచేసినట్లు తెలుస్తున్నది అందుకే ఇస్మార్ట్ శంకర్ కోసం ఇంతలా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి.. ఇటీవలే సినిమా షూటింగ్ సెట్లో నుంచి రామ్ సెల్ఫీ తీసుకుంటున్నట్లు కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం సంజయ్ దత్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారుతోంది.