అంగరంగ వైభోగంగా జరిగిన వరుణ్, లావణ్యాల పెళ్లి…. పవన్ లుక్స్ వైరల్…!!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిన్న ఒకటైన సంగతి మనకి తెలిసిందే. ఇటలీలో వీరి పెళ్లి వేడుకలు అంగరంగ వైభోగంగా జరిగింది. గత వారం రోజుల నుంచి వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే వీరి పెళ్లి హడావిడి మొదలైనప్పటి నుంచి ఎవరో.. ఒకరు ఎక్కడో చోట కనిపిస్తూనే ఉన్నారు. కానీ పవన్ మాత్రం ఏ ఒక్క ఫోటోలోనూ కనిపించలేదు.

దీంతో పవన్ కళ్యాణ్ ఎందుకు ఫోటో లోకి రాలేదు? అసలు ఆయన ఎక్కడున్నాడు అంటూ అభిమానులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. పెళ్లి.. వరుణ్, లావణ్య ది అయినప్పటికీ పవన్ కళ్యాణ్ లేకపోతే దాంట్లో సందడే ఉండదంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు. ఆఖరికి మూడు ముళ్ళు టైంలో కనిపించాడు పవన్. ఆయన లుక్స్ తో మరోసారి ప్రేక్షకులని ఖుషి చేశాడు. ఫేస్ కనిపించకుండా బ్యాక్ ఫోటోను షేర్ చేసినప్పటికీ… అభిమానులు ఇట్టే గుర్తుపట్టేశారు. వరుణ్ తేజ్ ని పెళ్లి కొడుకుగా తయారు చేసి తీసుకెళ్తున్న క్రమంలో.. ఈయన బ్యాక్ సైడ్ లుక్ కనిపించింది.

అంతే ఇక ఆ ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు మెగా ఫ్యాన్స్. అందరూ పెళ్లిలో హడావిడిగా… డిజైనర్ దుస్తులు ధరిస్తే… పవన్ మాత్రం చాలా సింపుల్ గా స్టైలిష్ గా రెడీ అయ్యాడు. ఆలివ్ కలర్ టీ షర్ట్.. ఖాకీ కలర్ ప్యాంట్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు…” మా అన్న రావడానికి లేట్ అవ్వచ్చు కానీ లేటెస్ట్ గా వస్తాడు..” అంటూ కామెంట్లు చేస్తున్నారు.