సూపర్ స్టార్ కృష్ణ ప్రొడ్యుస‌ర్‌గా వ్య‌వ‌భ‌రించిన‌ చిరంజీవి మూవీ ఏంటో తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు స్టార్ హీరోలే. వీరికి టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక చిరంజీవి కంటే ముందే ఇండస్ట్రీలోకి కృష్ణ అడుగుపెట్టి స్టార్ హీరో అయిన సంగతి తెలిసిందే. అలాగే చిరంజీవి నటించిన సినిమాను కూడా కృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు అన్న సంగతి చాలామందికి తెలియదు. ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ సినిమాల రేంజ్ నే మార్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా.. అనుకుంటున్నారా. 1983లో రిలీజ్ అయిన ఖైదీ. కోదండి రామిరెడ్డి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాధవి లతా హీరోయిన్ గా నటించారు.

ఈ సినిమాలో చిరంజీవి జైలు నుంచి తప్పించుకున్న స్మగ్లర్ ముఠాపై పోరాటంలో అడుగుపెట్టిన ఖైదీగా కనిపించాడు. ఈ సినిమాలో చిరంజీవి డ్య‌న్స్, ఫైట్‌ల‌తో తన నటవిశ్వ‌రూపం చూపించాడు. ఇది చిరంజీవి కెరీర్‌లో మైల్డ్ స్టోన్‌గా చెప్పవచ్చు. కెరీర్ లోనే మొదటి కమర్షియల్ హిట్‌గా నిలిచిన సినిమా కూడా ఇదే. అయితే 1984లో తెలుగులో ఖైదీ రీమేక్ గా హిందీలో ఈ సినిమా తెర‌కెక్కింది. హిందీ సినిమాకు ప్రొడ్యూసర్ మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన పద్మాలయ స్టూడియో బ్యానర్ పై ఈ సినిమా కి ప్రొడ్యూస్ చేశాడు. హిందీ వర్షన్ లో చిరంజీవి పాత్రను జితేంద్ర పోషించగా.. మాధవి హీరోయిన్గా నటించింది.

సుమలత పాత్రను హేమమాలిని పోషించగా, రంగనాథ్ పాత్రను శత్రుఘ్న‌సిన్తా నటించారు. పోలీస్ ఆఫీసర్‌లా శతృఘ్న‌సిన్తా కనిపించాడు. రావు గోపాల్ రావు విలన్ పాత్రలో ఖాదిర్ ఖాన్‌ మెప్పించాడు. ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ విజయాన్ని అందుకుంది. సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతగా ఓ రెంజ్‌కు తీసుకెళ్లింది. ఇలా కృష్ణ, చిరంజీవి తీసిన ఖైదీ మూవీ హిందీ రీమిక్ ప్రొడ్యూసర్ గా కృష్ణ వ్య‌వహరించాడు.

అయితే చిరంజీవి మూవీని కృష్ణారెడ్డి ప్రొడ్యూసర్ గా చూశారని చాలామంది అంటారు. ఇక ఆ హింది మూవీ ఖైదీ రీమేక్ అని ఇప్పటికే చాలామంది అభిమానులకు తెలియదు. ఇకపోతే ఈ మూవీ ఒకటే వారి తెలుగు సినీ పరిశ్రమ రేంజ్‌ను మార్చింది. సాధారణంగా అసలుకు విభిన్నంగా.. ప్రంతాని బ‌ట్టి ప్రేక్షకులు, సంస్కృతి అనుకూలంగా మార్చి తెరకెక్కిస్తారు. కానీ హిందీ కథ‌ దాదాపు తెలుగుసినిమాకు కాపీగా రూపొందించారు. డైలాగులు, పాటల్లో మాత్రమే చిన్నచిన్న మార్పులు జరిగాయి.