సుడిగాలి సుదీర్ సినిమాకు అన్ని కోట్లు బడ్జెట్..!!

బుల్లితెర మీద తన కామెడీతో అద్భుతమైన స్కిట్లతో కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ గా పేరు పొందారు నటుడు సుడిగాలి సుదీర్.. ఈయన ప్రస్తుతానికి సినిమాలలో హీరోగా నటిస్తూ మంచి పాపులారిటీ అందుకున్నారు. ఇంతకుముందు ఆయన చేసిన గాలోడు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సుధీర్ కి హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సుకుమార్ దగ్గర డైరెక్టర్ అసిస్టెంట్గా పనిచేసిన ఒక డైరెక్టర్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే సుధీర్ మీద అంత బడ్జెట్ పెట్టడం చాలా కష్టం పలువురు నెటిజన్స్ తెలుపుతున్నారు.. ఎందుకంటే కొత్త డైరెక్టర్ కి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి అలాగే సుధీర్ మార్కెటింగ్ పెద్దగా డిమాండ్ ఉండదు కాబట్టి దీని వల్ల ప్రొడ్యూసర్ కి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని వార్తలు వినిపిస్తున్నాయి.

సుధీర్ మీద 15 కోట్ల బడ్జెట్ పెట్టి ప్రొడ్యూసర్ చాలా రిస్క్ చేస్తున్నారంటు చాలామంది తెలుపుతున్నారు.. ఒకటి రెండు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ అయితే పర్వాలేదు కానీ కొత్త ప్రొడ్యూసర్ అయితే చాలా రిస్క్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఇటీవలే గోస్ట్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గాలోడు సినిమాతో 20 కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్స్ ని రాబట్టిన సుధీర్ మరి ఘోస్ట్ సినిమాతో ఏ విధంగా కలెక్షన్స్ రాబట్టి ప్రేక్షకులను మెప్పిస్తారు చూడాలి మరి.