టాలీవుడ్ సినిమాల వాయిదాల ప‌ర్వం మ‌ళ్ళి మొద‌లైంది.. ఈ సారి ఎన్ని సినిమాలంటే..?

తెలుగు ఇండస్ట్రీలో మరోసారి వరుసగా సినిమాల వాయిదాలు పడడం మొదలైంది. ఈసారి ఒకేసారి మూడు సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో అందరి దృష్టి ఆ సినిమాల వైపుగా మళ్ళింది. వీటిలో చెప్పుకోదగ్గ మూవీ డెవిల్. ఏ సినిమా మొదటి నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే డెవిల్ ఆ డేట్ కి ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. దానికి కారణం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడమేనట. డెవిల్ కు భారీగా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఉంది. అది ఇంకా పూర్తి కాలేదు దీంతో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమాను వియిదా వేస్తున్నట్లు మేకర్స్ వివరించారు.

అయితే మళ్ళీ రిలీజ్ చేసేది ఎప్పుడు అనే అంశాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. డెవిల్ తర్వాత ప్రేక్షకుల్లో కాస్త కూస్తో బజ్ ఉన్న సినిమా ఆదికేశవ. ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది. అలాగే భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. దీంతో వరల్డ్ కప్ ప్రభావం సినిమాపై చాలా పడుతుంది. ముఖ్యంగా భారత్ మ్యాచ్ లు ఉన్న టైంలో థియేటర్లు ఆక్యుపెన్సి తగ్గుతుంది. అందుకే నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన ఆదికేశవ ను నవంబర్ 24 కు వాయిదా వేశారు మూవీ టీం. అలాగే ఈ సీజన్‌లో వాయిదా పడుతున్న మరో సినిమా గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి. నిజానికి ఈ సినిమా డిసెంబర్ మొదటివారం అనుకున్నారు.

కానీ ఊహించని విధంగా నాని, నితిన్ సినిమాలు అదే రోజున రిలీజ్ అవుతున్నాయి. దీంతో గ్యాంగ్స్ ఆప్ గోదావరి సినిమా వాయిదా పడింది. దీనిపై హీరో విశ్వక్ ఫైర్ కూడా అయ్యారు. నిర్మాత మాత్రం విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. సినిమా వాయిదా వేయాలనుకోవడం లేదు అని చెబుతూనే.. షూటింగ్ పెండింగ్‌లో ఉంది, పాట బ్యాలెన్స్ ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంది అంటూ పిచ్చి సాకులు చెప్తున్నారు. ఇదంతా జరిగి సినిమా చూసిన తర్వాత ప్రశాంతంగా ఆలోచిస్తామంటున్నారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 29న ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట‌.