ఇటలీలో గ్రాండ్ గా వరుణ్ లావణ్యల వివాహం పెళ్లి పిక్స్ వైరల్..

మెగా కుటుంబంతోపాటు ఫ్యాన్స్ అంతా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న కళ్యాణ ఘడియలు రానే వ‌చ్చాయి. మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ సొట్టబుగ్గల సుందరు లావణ్య త్రిపాఠి వేదమంత్రాల సాక్షిగా వివాహ బంధంతో ఒకటయ్యారు. మెగా కుటుంబంలో ఇటలీలోని టస్కానీ వేదికపై చాలా గ్రాండ్‌గా ఈ పెళ్ళి వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుకలకు కొణిద‌ల కుటుంబ స‌భ్యుల‌తోపాటు లావ‌ణ్య త్రిపాఠి, అల్లు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న కళ్యాణ‌వేడుక‌లో మెగా సామ్రాజ్య అధినేత వరుణ్ పెదనాన్న అయిన మెగాస్టార్ చిరంజీవి అన్ని తానై పెళ్లి పనులను గ్రాండ్గా నిర్వహించాడు. పెళ్లి వేరే దేశంలో జరిగిన ఇక్కడ భారతీయ కట్టుబాట్లకు డోకా రానీయకుండా సాంప్రదాయపద్ధంగా వరుణ్ – లావణ్య వివాహం జరిగిందట. దాదాపు ఈ వేడుకల్లో పాల్గొన్న వారంతా సాంప్రదాయ దుస్తులు దర్శనం ఇచ్చారట‌.

చిరంజీవి దంపతులు, పవన్ కళ్యాణ్ దంపతులు, అల్లు అర్జున్ దంపతులు, రామ్‌చరణ్ దంపతులు ఇంకా మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అంతా పాల్గొని సందడి చేశారు. వివాహ వేడుకకు సంబంధించి వరుణ్ – లావణ్య పిక్ ఇన్‌స్టా ఎక్స్ వేదిక‌గా నాగబాబు పోస్ట్ చేశాడు. కొత్తగా పెళ్లయిన వరుణ్ కొణిదల – లావణ్య కొణిదల జంటకు మీ అంద‌రి ఆశీస్సులు కావాలి అంటూ ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట‌ సందడి చేస్తుంది.