ఆ తెలుగు స్టార్‌హీరో న‌న్ను రూమ్ కి రమ్మన్నాడంటూ ఆరోపణలు చేసిన తమిళ సీనియర్ యాక్టర్ విచిత్ర..

గతంలో పలు టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది విచిత్ర. టాలీవుడ్‌కు దూరమైన ఈ బ్యూటీ తమిళ్ ఇండస్ట్రీలో యాక్టర్ గా చాలా సినిమాలో న‌టించింది. ఇక తాజాగా త‌మిళ్ బిగ్‌ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా నవంబర్ 21న జరిగిన ఎపిసోడ్ లో తన జీవితంలో మలుపు తిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ అడగగా ఆమె ఇలా చెప్పుకొచ్చింది. నటి విచిత్ర మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం నన్ను సినిమా నుంచి తప్పుకునేలా చేసిన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చెప్తున్నాను అంటూ వివరించింది. 2001 సంవత్సరంలో నేను ఓ తెలుగు సినిమాలో నటించా. దురదృష్టవశాత్తు అదే నా చివరి సినిమా అంటూ ఆమె వివరించింది.

ఈ సినిమా షూటింగ్ టైంలో నేను కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఫేస్ చేశానని.. నేను సినిమాలకు దూరం అవడానికి కూడా కారణం అదేనంటూ వివరించింది. నేను మర్చిపోదాం అనుకున్నా అది నా గుండెల్లో ఎప్పటికీ రగులుతూనే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చిన విచిత్ర ఆ సినిమా షూటింగ్ టైం లో నన్ను ఒక త్రీ స్టార్ హోటల్లో ఉంచారని చెప్పుకొచ్చింది. అయితే మేమంతా సినిమా వాళ్ళం కావడంతో ఆ హోటల్ వాళ్ళు మాకోసం ఓ పార్టీ ఏర్పాటు చేశారని.. ఆ పార్టీ ముగిసిన తర్వాత సినిమా హీరో నా దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా తన గదికి రమ్మని అడిగాడని.. నేను దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను.. నాకేమీ అర్థం కాలేదంటూ వివరించింది.

నేను పట్టించుకోకుండా కామ్ గా నా గ‌దికి వెళ్లి పడుకున్నానని తర్వాత రోజు నుంచి షూటింగ్లో పాల్గొన్నప్పుడల్లా నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టారని.. చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని.. ఆ తర్వాత నాకు సినిమాలంటేనే ఇంట్రెస్ట్ పోయిందని.. పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యానంటూ చెప్పుకొచ్చింది విచిత్ర. అయితే ఈ వీడియోలో ఆ హీరో ఎవరు అనే విషయాన్ని అసలు మెన్షన్ చేయలేదు. కాగ‌ ఆమె చెప్పిన సమాచారం ప్రకారం విచిత్ర తెలుగులో నటించిన ఆ సినిమాలో హీరో ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు అని నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.