సీనియర్ జర్నలిస్ట్‌ని అలా చేయబోయిన సల్మాన్ ఖాన్.. ఇదెక్కడ దారుణంరా బాబు…!!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అనేక సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈయన… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ చేసిన పని కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యాడు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క 54వ అడిషన్ లో సల్మాన్ పాల్గొన్నారు.

నవంబర్ 21, 2023 మంగళవారం సాయంత్రం ఫిల్మ్ ఫెస్టివల్ లో ఘనంగా కనిపించాడు. ఈ కార్యక్రమంలో..సల్మాన్ తన మేనకోడలు అలిజె అగ్నిహోత్రితో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ ఓ సీనియర్ జర్నలిస్టును ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు.

అయితే సల్మాన్ ఖాన్ తమాషాగా ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం.. అలా చేయడం తప్పంటూ సీరియస్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఈయనపై అనేక ట్రోలింగ్ లు సైతం చేస్తున్నారు.