సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మహేష్ తాజాగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ” గుంటూరు కారం ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ షూటింగ్ పనులు బ్రేక్స్ లేకుండా బిజీబిజీగా కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల మేకర్స్ మూవీ లోని మొదటి సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు.
ఈ లిరికల్ వీడియో 24 గంటలలోనే 10 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇక దీంతో ఇంతకుముందు లాగా బజ్ మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. ఈ సినిమా నిర్మాత నాగవంశీ రీసెంట్ గా ఒక అప్డేట్ ఇచ్చారు. గుంటూరు కారంలో తర్వాత రాబోయే మూడు పాటలు అద్భుతంగా ఉండబోతున్నట్లు ఈయన తెలిపాడు. ఇక ఇదిలా ఉండగా.. గుంటూరు కారం మూవీ లో ఓ పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో మహేష్ బాబు ఓ పాటకు డాన్స్ వేస్తూ కనిపించారు. ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన ప్రేక్షకులు…” వీళ్ళని ఇలాగే వదిలేస్తే మూవీ మొత్తం లీక్ చేసేలాఉన్నారు… ఇక సినిమాపై ఇంట్రెస్ట్ ఏముంటుంది ” అంటూ ఫైర్ అవుతున్నారు మహేష్ ఫ్యాన్స్.