ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో డాన్స్ చేస్తూ కాలుజారి పడిపోయిన బాలీవుడ్ హీరో… వీడియో వైరల్…!!

షాహిద్ కపూర్ మనందరికీ సుపరిచితమే. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు సూపర్ డ్యాన్సర్ కూడా. పలు బాలీవుడ్ సాంగ్స్ లో తన డ్యాన్స్ మూమెంట్స్ తో.. తన టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అందుకే తాజాగా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా… అవార్డ్స్ ఫంక్షన్ లో ఇచ్చారు.

అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు కూడా. అయితే ఎండింగ్లో స్లిప్ అయ్యి కింద పడిపోయాడు. కానీ దీన్ని స్పోర్టివ్ గా తీసుకున్న ఈయన.. వెంటనే లేచి మ్యూజికల్ బీట్స్ కు తగినట్లుగా స్టెప్స్ కంటిన్యూ చేశాడు.

దీంతో అక్కడున్న ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ గట్టిగా అరుస్తూ ఆయనకు ఎనర్జీ ఇచ్చారు. దీంతో షాహిద్ వాళ్లకి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ విష్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” రియల్ హీరో ” అంటూ ప్రేక్షకులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు.. షాహిద్ కి మంచి సినిమా అవకాశాలు వచ్చి పెద్ద పాన్ ఇండియా హీరో అవ్వాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.