ఆ ప్రాంతంలో జ్యోతిక సినిమా బ్యాన్.. అసలు మాటర్ ఏమిటంటే..?

మలయాళం చిత్ర పరిశ్రమలో తిరుగు లేని రారాజు సూపర్ స్టార్ మమ్ముట్టి. ఏడు పదుల వయసు వచ్చినా, ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే క్రిస్టోఫర్, కన్నూర్ స్క్వాడ్, ఏజెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మమ్ముట్టి, మరో చిత్రంతో ప్రేక్షకులముందు రాబోతున్నారు. ఈ చిత్రం పేరు “కాదల్ – ది కొర్”. ఈ చిత్రంలో హీరోయిన్ జ్యోతిక కూడా నటిస్తున్నారు. కానీ ఈ చిత్రం తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. ఆసక్తికరమైన కాదాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొన్ని దేశాలు బ్యాన్ చేసాయి. మమ్ముట్టి లాంటి స్టార్ హీరో చిత్రాన్ని బాన్ చెయ్యడం ఏమిటి ? అంతగా ఆ కధలో ఉన్న తప్పేమిటి ? అనుకుంటున్నారా….ఐతే ఇది చూడండి.

మమ్ముట్టి, జ్యోతిక జంటగా నటిస్తున్న “కాదల్ – ది కొర్” చిత్రానికి జిఓ బేబీ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి తన సొంత బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐతే ఈ చిత్రం కధ, స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిచేలా ఉండడమే ఈ చిత్రం బ్యాన్ అవ్వడానికి కారణం. ఇప్పటివరకు ఈ చిత్రాన్ని కువైట్, కతార్ దేశాలు బాన్ చేసాయి. మరికొన్ని దేశాలు కూడా బ్యాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఈ చిత్రాన్ని త్వరలో కేరళలో జరగనున్న “ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ కేరళ” లో ప్రదర్శించనున్నారట మేకర్స్. దీనికోసం ఒక వార్త పత్రిక ఈ చిత్రం కాదాంశాన్ని తమ పేపర్ లో ప్రచురించింది. సినిమా కథ ఏమిటంటే, ఉద్యోగం నుంచి రిటైర్ అయినా జార్జ్ (మమ్ముట్టి) అనే వ్యక్తి తన భార్య ఓమనతో (జ్యోతిక) కలిసి నివసిస్తుంటాడు. ఆయన తన ఊరి పంచాయతీ ఎన్నికలలో పోటీ చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. కానీ రెండు రోజుల తరువాత ఓమన, తన భర్త అదే ఊరిలో ఉంటున్న ఒక డ్రైవింగ్ స్కూల్ యజమానితో స్వలింగ సంపర్క బంధంలో ఉన్నాడని, అందువలన తనకి విడాకులు కావాలని కోర్ట్ ని ఆశ్రయిస్తుంది. కానీ జార్జ్ ఈ ఆరోపణలను ఖండిస్తాడు.


ఆ తరువాత ఏం జరిగింది అన్నదే కథ. స్వలింగ సంపర్కాన్ని ప్రజలు ఏ దృష్టో చూస్తున్నారు అనే అంశం పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ కథ బయటకు రాగానే ఈ చిత్రాన్ని కువైట్, కతార్ దేశాలు బ్యాన్ చేసాయి. తమ దేశంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనివ్వమని పేర్కొన్నాయి. నవంబర్ 23 న ఈ చిత్రం విడుదల కాబోతోంది.