రష్మితో పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సుధీర్… ఇదెక్కడ డేర్ రా బాబు…!!

బుల్లితెర రియల్ జోడి సుడిగాలి సుదీర్, రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై ఎంతమంది జంటలు క్యూ కట్టినప్పటికీ… ఈ జంటకు మాత్రం ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్, కెమిస్ట్రీ ఎంతో బాగుంటుంది. దీంతో వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుండు అని కూడా చాలామంది కోరుకుంటున్నారు. అయితే.. రష్మీ, సుధీర్ ప్రేమ గురించి అడిగితే మాత్రం అది స్క్రీన్ వరకే అని చాలా సార్లు చెప్పుకొచ్చారు.

అయినప్పటికీ వీరి ప్రేమ, పెళ్లి జరగాలని సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఇక ఈ విషయాలపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు సుధీర్. ఈయన తాజా మూవీ ” కాలింగ్ సహస్ర ” . ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది.. రిలీజ్‌ సమయం దగ్గరికి రావడంతో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలోనే రష్మితో ఉన్న రిలేషన్ పై మరోసారి ఓపెన్ అయ్యాడు సుధీర్. ” మీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు.

మీ పెళ్లి రష్మి తోనేనా ” అని మీడియా వాళ్ళు ప్రశ్నించగా…” మాది ఆన్ స్క్రీన్ వరకే అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అదే అడుగుతున్నారంటే మా జోడిని అంతలా ఓన్ చేయాలనుకున్నారు అందరూ. అది స్క్రీన్ వరకే. ఇక పెళ్లి గురించి అయితే ఇప్పట్లో చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం కెరీర్, ఫ్యామిలీ అంతే. ఒకవేళ దేవుడు పెళ్లి వైపు మనసు మళ్లిస్తే చెప్పలేం చేసుకుంటానేమో ” అంటూ చెప్పుకొచ్చాడు. కానీ రష్మీని పెళ్లి చేసుకుంటాడా? మరొకరిని పెళ్లి చేసుకుంటాడా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం సుధీర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.