బిపాసా బసు తో బంధంపై క్లారిటీ ఇచ్చేసిన రానా..!!

టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా, బిపాసా బసు కలిసి “తే ఆమో”అని సూపర్ హాట్ పాటలో ఇద్దరూ కలిసి రొమాన్స్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత షూటింగ్ సమయంలో ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారని రూమర్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే ఇందులో నిజం లేదని వివాహం కాకముందే రాన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూన్నది.

రూమర్సులకు సైతం తనదైన స్టైల్ లో రానా చెక్ పెట్టడం జరిగింది. దీంతో చాలామంది సైతం రానా అని కూడా పలు రకాలుగా క్యూస్షన్లు అడగడం జరిగింది. అందుకు రానా స్పందిస్తూ రోహన్ నుంచి బిపాసా వరకు దమ్ మారో దమ్ టీం అందరూ కూడా మా స్నేహితులే వాస్తవానికి నేను మరో అమ్మాయి పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని కానీ ఆమె బాలీవుడ్ చెందినది కాదు అంటూ తెలియజేశారు. అయితే ఆ తర్వాత చాలామంది నీ బర్తడే పార్టీకి ఆమె ముంబై నుంచి హైదరాబాద్ కి రావడం జరిగింది కదా అంటూ అడగగా.

ఆమె తన స్నేహితురాలు మాత్రమే మీడియా వారు కావాలని ఇలాంటి రచ్చ చేస్తున్నారంటూ అసంతృప్తిని తెలియజేశారు రానా. తాను ఏ విషయాన్ని అయినా సరే డైరెక్ట్ గా చెబుతానని ఇలా రహస్యాలు ఏవి దాచుకొని ఉండాలని తెలిపారు.. తనకు ప్రైవేట్ లైఫ్ అసలు నచ్చదని తెలియజేయడం జరిగింది. రానా మొదటి సారి లీడర్ సినిమాతో వెండితెరకు సైతం పరిచయమయ్యారు ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. రానా ఏదైనా పాత్ర నచ్చితే చిన్న సినిమాలోనైనా సరే నటిస్తూ ఉంటారు.