అమ్మ బాబోయ్.. సంయుక్త -సమంత అక్క, చెల్లెల్లా… ఇదెక్కడ బంధుత్వం రా బాబు…!!

ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా వాడడం ఏ రేంజ్ లో పెరిగిందో మనందరికీ తెలిసిందే. దీనిని కొందరు మంచికి ఉపయోగించుకుంటే మరికొందరు మాత్రం చెడికి ఉపయోగించుకుంటున్నారు. ఇక మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొందరు హీరోయిన్స్ ని టార్గెట్ గా చేసుకుని వాళ్లపై వల్గర్ వీడియోలను తయారు చేస్తున్నారు. ఇక తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత, సంయుక్త మీనన్ అక్క, చెల్లెలు అంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది. బ్లడ్ రిలేషన్ లేకపోయినా సరే సినీ రిలేషన్ ఆధారంగా వీళ్ళిద్దరూ అక్క, చెల్లెల్లు..అవుతారంటూ పలువురు ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు.

హీరోయిన్ సమంత ని.. సంయుక్త తో పోల్చి చూస్తే వీళ్ళిద్దరి కళ్ళు… ముక్కు.. లిప్స్ ఒకేలా ఉన్నాయని.. చూసే చూపు కూడా ఒకే విధంగా ఉంటుందని.. కాబట్టి వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు అనుకోక తప్పదని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇలా బ్లడ్ రిలేషన్ లేకపోయినప్పటికీ.. వీరిద్దరికీ సినీ రిలేషన్ ద్వారా బంధం ముడి పడినట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.