షూటింగ్స్ లేని సమయంలో అలా చేస్తున్న రష్మిక… ఇదెక్కడ దరిద్రం రా బాబు…!!

” పుష్ప ” సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది రష్మిక. నేషనల్ క్రష్ గా తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రష్మిక నటిస్తున్న తాజా మూవీ ” యానిమల్ “. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉంది రష్మిక.

ఇందులో భాగంగానే యానిమల్ టీం.. నందమూరి నటసింహం హోస్ట్ గా వ్యవహరిస్తున్న ” అన్ స్టాపబుల్ ” షో కి రష్మిక, రణబీర్ , సందీప్ రెడ్డి వంగా..హాజరయ్యారు. అలాగే ఈ షోలో పలు ఆసక్తికర విషయాలను సైతం చర్చించారు. అంతేకాదు రష్మిక, విజయ్ దేవరకొండకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను కూడా తెరమీదకు తీసుకొచ్చాడు బాలయ్య. ఇక ఈ క్రమంలోనే బాలయ్య… రణబీర్, సందీప్ లను రష్మిక గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు.

 

షూటింగ్ లేనప్పుడు రష్మికను కలవాలంటే ఎక్కడికి వెళ్లాలి? అసలు షూటింగ్ లేకపోతే రష్మిక ఏం చేస్తుంది? అని బాలయ్య ప్రశ్నించగా… ఈ ప్రశ్నకి ఇద్దరూ ఒకే సమాధానం చెప్పారు. రష్మిక దాదాపు సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతుందని.. ఒకవేళ ఆమెకు షూటింగ్ లేకపోతే… కచ్చితంగా జిమ్ లోనే ఉంటుందని.. అక్కడికి వెళితే రష్మికను ఇట్టే పట్టుకోవచ్చని చెప్పుకొచ్చాడు రణబీర్. ఇక ప్రస్తుతం రణబీర్ కపూర్, సందీప్ వంగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.