బ్రేకింగ్: రష్మిక, కాజోల్… ఇప్పుడు ఏకంగా ఆలియా భట్… వైరల్ అవుతున్న బోల్డ్ వీడియో…!!

ఇటీవలే రష్మిక డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్మికకు పలువురు మద్దతుగా కూడా నిలిచారు. ఇక ఈ వీడియోలో ఉన్నది రష్మిక కాదని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్ గా ఆ తర్వాత అందరికీ అర్థమైంది. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి తెలిపారు.

అయినప్పటికీ అవి కట్టడి కాలేదు. ఆ తర్వాత హీరోయిన్ కాజోల్ వీడియో కూడా బయటకు వచ్చింది. తాజాగా.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కు సంబంధించిన ఓ బోల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ యువతి ముఖానికి ఎఐ ద్వారా ఆలియా భట్ ముఖాన్ని సెట్ చేసి నెట్టింట ఓ పోస్ట్ విడుదల చేశారు. ఆ వీడియో చూడగానే మనకు అది డీప్ ఫేక్ వీడియో అని అర్థమవుతుంది.

వీడియోలో కనిపించిన అమ్మాయి ఎవరు? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఇక ఇప్పుడు దీనిపై ఆలియా భట్ అలాగే ప్రముఖులు స్పందించాల్సి ఉంది. మరోవైపు డిప్ ఫేక్ వీడియోలను చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పటికైనా వీటిని ఖండించాలంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by @pauseshooter