” సలార్ ” స్టోరీ లైన్ లీక్ చేసిన ప్రశాంత్ నీల్… ఇక బొమ్మ దద్దరిల్లాల్సిందేగా…!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ మూవీ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాని ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాడు. అందులో పార్ట్ 1 డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ చేసి.. వరుస ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టోరీ లీక్ చేశాడు. ఈయన మాట్లాడుతూ…” ఇద్దరు ప్రాణ స్నేహితులు కొన్ని కారణాలవల్ల బద్ధ శత్రువులుగా మారతారు.

వారి మధ్య సాగే కథనే సలార్. ఎన్నో ఎమోషనల్ సీన్స్ తో పాటు గా అంతకంత యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు మొదటి పార్ట్ లో సగం కథ, అలాగే రెండవ పార్ట్ లో మరో సగం కథ వస్తుంది “అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. ఈయన వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు…” ఈయన చెప్పే విధానం బట్టి చూస్తే బొమ్మ దద్దరిల్లాల్సిందే లగా ఉందిగా..” అంటూ కామెంట్లు చేస్తున్నారు.