అమర్ భార్య తేజు ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆమెను ట్యాగ్ చేస్తున్నారు.. యాక్టర్ నరేష్ లోల్లా కామెంట్స్ వైర‌ల్..

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ సెవెన్ రసవత్త‌రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో అమర్‌దీప్ కంటిస్టెంట్ గా వ్యవహరిస్తున్నాడు. దాదాపు బిగ్ బాస్ ఫాలో అవుతున్న ఆడియన్స్ అంతా బిగ్ బాస్ టాప్ ఫైవ్‌లో అమర్ కచ్చితంగా ఉంటాడు అంటూ చెబుతున్నారు. అయితే కొంతమంది బిగ్‌బాస్ ప్రేక్షకులు మాత్రం అభిమానం పేరుతో రచ్చ రచ్చ చేస్తూ హౌస్ లో ఉన్న తమ కంటెస్టెంట్ కు ఆపోజిట్ గా మాట్లాడిన వారిపై వారి కుటుంబంపై అసభ్యకరంగా మాట్లాడుతూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో జరిగిన బిగ్ బాస్ సీజన్‌లో కూడా చాలామందికి ఫ్యాన్స్ ఉన్నారు. వారి వారి ఫేవరెట్ కంటెస్టెంట్లకు సపోర్ట్ చేశారు.

కానీ ఈ సీజన్లో మాత్రం ఫ్యాన్స్ దిగజారిపోతూ హౌస్ లో ఇతర కంటిస్టెంట్‌లు ఆడే ఆటకి బయట ఉన్న వాళ్ళ కుటుంబాలను తిట్టేందుకు నీచంగా బిహేవ్ చేయడానికి కూడా సై అంటున్నారు. అమర్ తల్లిని, భార్యను తిట్టడమే కాకుండా.. అమర్ భార్య తేజస్విని ఫోటోలను మార్ఫ్ చేసి ఆమెకే ట్యాగ్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ఎవరితో చెప్పుకోలేక పోతుంది. తనలో తానే నరకాన్ని అనుభవిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఏ ఫ్యామిలీలో కూడా.. ఏ సీజన్లో జరగలేదు. కేవలం ఈ సీజన్లో మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి.

నేను సైబర్ క్రైమ్ కి ఫోన్ చేసి ఆ మార్ఫింగ్ ఫోటోలను, ఎకౌంటులను తొలగించేశాను. కానీ మరి కొంతమంది తేజు అమర్‌కు అసలు సపోర్ట్ చేయడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారికి ఎలా తెలుస్తుంది ఆమె సపోర్ట్ చేస్తుందో.. లేదో.. హౌస్‌లో అమ‌ర్ ప‌డుకునేంత‌వ‌ర‌కు తేజు పడుకోదు. అమరకు ఎప్పుడెప్పుడు ఏం కావాలి.. ఏ డ్రెస్సులు ఇవ్వాలి.. మెడిసిన్స్ ఏం పంపించాలి.. అనే విషయాలన్నీ ఆలోచిస్తూ అన్ని తనే దగ్గర ఉండి చూసుకుంటుంది. ఇవన్నీ తెలియకుండా అమర్ కు సపోర్ట్ చేయడం లేదు అంటూ తప్పుగా కామెంట్ చేస్తున్నారు అంటూ నరేష్ లోల్లా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.