హైదరాబాద్‌కి మక్కాం షిఫ్ట్ చేసిన కాజల్.. కారణం అదేన‌ట‌..

ముంబై నుండి వచ్చి తెలుగు సినిమాలు చేసిన చాలామంది యాక్టర్స్ ఇక్కడ సినిమా అవకాశాన్ని చేతక్కించుకుంటూ హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకొని సెటిలైపోయారు. కొంతమంది మాత్రం ముంబైలో ఉంటూ అక్కడ నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు. అలాంటి వారిలో కాజల్ కూడా ఒకటి. అయితే కాజల్‌కు వివాహమే పిల్లాడు పుట్టాక కాజల్ పూర్తిగా హైదరాబాద్‌కు మ‌క్కాం షిఫ్ట్ చేసింది. ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచే పని చేస్తున్నానంటు వివరించింది. మా అబ్బాయిని ఎక్కువగా మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకనే నేను హైదరాబాద్ వచ్చేసా. ఇక్కడే ఉంటున్న, ఇక ఇక్కడి నుంచి షూటింగ్లకు వెళుతూ ఉంటా. మా అబ్బాయిని కూడా ఇక్కడ ఒక ప్లే స్కూల్లో జాయిన్ చేశాను అంటూ వివరించింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్న కాజ‌ల్ ప్రస్తుతం తన 60వ‌ సినిమా సత్యభామ లో నటిస్తుంది. కాజల్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంద‌ట‌. ఇక ఇలాంటి పాత్రలో పేరుపొందిన విజయశాంతిని స్ఫూర్తిగా తీసుకొని ఈ క్యారెక్టర్ లో నేను నటిస్తున్న అంటూ చెప్పుకోచ్చిన కాజల్.. నేను తీసిన అన్ని సినిమాల్లో ఇది నాకు చాలా స్పెషల్ అంటూ వివరించింది. నేను మేజర్ సినిమా చేసేటప్పుడు ఈ సినిమా చాలా నచ్చింది. సినిమా దర్శకుడు శశికిరణ్ టిక్కాతో ఒక సినిమాలో అయినా పనిచేయాలి అనుకున్నా అంటూ వివ‌రించింది.

వెంటనే అతను ఈ కథ‌ పట్టుకొని నా దగ్గరికి రావడం.. కథ‌ విన్నాక వెంటనే అంగీకరించడం జరిగిపోయాయి. ఈ సత్య‌భామ‌ మూవీలో చాలా డ్రామా ఉండబోతుందంటూ వివరించింది కాజల్. ఇక ఈ సినిమాకు ముందు కాజల్ భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం శంకర్ నేర్పిన ఫైట్ సీన్లు కూడా నాకు సత్యభామ మూవీకి ఉపయోగపడ్డాయి అంటూ వివరించింది. అలాగే ఈ సినిమాలో నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. అతను ఒక ఆధర్, కథలు రాస్తూ ఉంటాడు.. ఆ రోల్ నవీన్ చంద్ర చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రకాష్ రాజు కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.