“ఎన్టీఆర్ అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు”..ఎవ్వరికి తెలియని విషయాని బయట పెట్టిన శ్రీకాంత్..!!

సినిమా ఇండస్ట్రీలో శ్రీకాంత్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నా సరే హీరోగా శ్రీకాంత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా చిరంజీవి – బాలకృష్ణ – వెంకటేష్ – నాగార్జునలు పెద్ద పెద్ద సినిమాలతో హిట్ కొడుతూ ఉంటే చాలా సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చి హిట్ కొట్టి బాక్సాఫీస్ రికార్డును బ్రేక్ చేసిన ఘనత శ్రీకాంత్ అందుకున్నారు.

. “ప్రజెంట్ తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న శ్రీకాంత్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ తుంటరితనం గురించి బయట పెట్టాడు ఎన్టీఆర్ చాలా చాలా అల్లరి వాడు .. ఎంత అల్లరి చేస్తాడు అంటే భరించలేం ..ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు మా ఇంటి పక్కనే ఉండేవాడు ..చాలా అల్లరివాడు.. ఓ రోజు మా ఇంటికి వచ్చి రోషన్ ని తీసుకొని వెళ్లి తన ఇంట్లో ఆడుకుంటున్నాడు ..మాకేమో టెన్షన్ వచ్చింది.. రోషన్ ఎక్కడ ఎక్కడ అంటూ వెతుక్కున్నాము..”

“చాలాసేపటికి కనిపించకపోయేసరికి బాధపడిపోయాం.. భయపడిపోయాం.. అప్పుడు తీరికగా ఎన్టీఆర్ వచ్చి ఏంటి బాబాయ్ వెతుకుతున్నారు అని అడిగాడు.. రోషన్ కనిపించట్లేదు రా అని చెప్పాను . అప్పుడు ఎన్టీఆర్ ..”బాబాయ్ వాడు నా దగ్గర ఆడుకుంటున్నాడు” అంటూ చాలా ముద్దుగా చెప్పాడు . ఓ పక్క టెన్షన్ మరో పక్క బాధ .. మరోపక్క భయం అన్ని మాటలలో చాలా ముద్దుగా ఎన్టీఆర్ మాట్లాడే సరికి కూల్ అయిపోయాను.. ఆ రోజు ఎన్టీఆర్ చేసిన పని నేను అస్సలు మర్చిపోలేకపోయాను” అంటూ శ్రీకాంత్ ఎమోషనల్ గా స్పందించారు..!!