ఐస్ ప్యాక్ వల్ల కలిగే లాభాలేవో తెలుసా..?

ఇంతవరకు మనం ఫేస్ గ్లోయింగ్ రావడానికి ఎన్నో క్రీములు వంటివి వాడుతూ ఉంటాము. కానీ వాటన్నిటి కంటే ఎక్కువగా ఐస్ వాటర్ ట్రిక్ ఉపయోగించడం వల్ల చర్మం చాలా సౌందర్యంగా ఉంటుందని నిపుణులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. సెలబ్రిటీల నుంచి ప్రముఖుల వరకు ఈ ఐస్ వాటర్ తో పలు రకాల ట్రిక్కులను ఉపయోగిస్తూ ఉంటారు. అందువల్లే వారు కూడా ఏజ్ బార్ అయినా కూడా టీనేజ్ లాగానే కనిపిస్తూ ఉంటారట. అసలు ఐస్ వాటర్ చర్మ సౌందర్యాన్ని కాపాడడం ఏంటి అని చాలామంది కొట్టి పారేస్తూ ఉంటారు.

ఉదయం లేచిన వెంటనే ముఖాన్ని కొద్దిసేపు ఐస్ వాటర్ లో డిప్ చేసి ఉంచితే నిద్ర మత్తులో ఉన్న ముఖం క్షణాలలో చాలా గ్లో గా మారిపోతుందట. ఇది ముఖం పైన ఉండే రంధ్రాలను సైతం మూసుకుపోయేలా చేస్తూ ఉంటుంది.. ఒకరకంగా చెప్పాలంటే చిన్న చిన్న రంధ్రాలతో చాలా అసహ్యంగా కనిపిస్తున్న వారి చర్మానికి ఇది ఒక చక్కటి ఔషధం లాంటిది. అయితే ఈ చల్లటి వాటర్ తో ముఖాన్ని సైతం ఎక్కువగా శుభ్రం చేయడం వల్ల చర్మం పొడిగా అయ్యి రాసేష్ వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువగానే ఉంటుంది.

రెండు మూడు నిమిషాల పాటు ఇలా ముఖాన్ని చల్లని నీటితో ఉంచితే ముఖం చాలా అందంగా మెరుస్తూ ఉంటుంది. అది కాకుండా అప్పటిదాకా సాధారణంగా టెంపరేచర్ లో ఉన్న ఫేస్ ఒక్కసారిగా చల్లని నీటిని తాగితే.. రక్త ప్రసరణ కూడా బాగా జరిగి ఉత్సాహంగా కనిపిస్తుంది. మనం ఉపయోగించే స్క్రబ్బులు మార్చరైజులు కంటే ఎక్కువగా ఐస్ వాటర్ ట్రికే చాలా ఉపయోగపడుతుంది.