” నేను త్రిష కు క్షమాపణలు చెప్పడం అనేది పెద్ద ఫన్నీ జోక్ “… మన్సూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…!!

లియో సినిమా నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. అతడు ఇటీవల త్రిష పై చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. లియో సినిమాలో త్రిష తో బెడ్ రూమ్ సీన్స్ చేయాలని ఉండే కానీ షూటింగ్లో ఆమెను నాకు చూపించలేదని కామెంట్స్ చేశాడు మన్సూర్.

ఈయ‌న వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు త్రిషకు మద్దతుగా నిలుస్తూ మన్సూర్ ను తిట్టిపోశారు. అలాగే త్రిష ఫాన్స్ మన్సూర్ ని క్షమాపణలు చెప్పమని యుద్ధం కూడా చేశారు. దీనికి మన్సూర్ సైతం.. త్రిష కు క్షమాపణలు చెప్పినట్లు.. ఇక ఈ యుద్ధం ముగిసినట్లు ఓ లేఖను విడుదల చేశారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ ఆలీ ఖాన్ మరికొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు.

” నేను నా మేనేజర్ తో ఫోన్ లో మాట్లాడినప్పుడు మారనితువిడు అని చెప్పాను. కానీ నేను చెప్పింది అతడికి మన్నితువిడు లా వినిపించింది. అందుకే లేఖలు అలా రాసినట్లు ఉన్నాడు. నేను త్రిష కు సారీ చెప్పడం అనేది పెద్ద జోక్ ” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో త్రిష తో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.