నాగచైతన్య జుట్టు – గడ్డం పెంచింది సినిమా కోసం కాదా.. పని లేక.. చైతు కామెంట్స్ వైరల్

అక్కినేని హీరో నాగచైతన్య చివరిగా నటించిన మూవీ కస్ఠ‌డి. ఈ సినిమా తర్వాత ఏ సినిమాలోను నటించలేదు. అయితే గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న నాగచైతన్య ఇటీవ‌ల ఓ కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవల నాగచైతన్య కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. గడ్డం, జుట్టు భారీగా పెంచుకొని ఆ పిక్స్ లో కనిపించాడు. అయితే ఏ హీరో అయినా తమ కొత్త సినిమా కోసమే గెట‌ప్ మారుస్తు ఉంటాడు. నాగచైతన్య కూడా అందుకే అలా గడ్డం జుట్టు పెంచారని అందరూ భావించారు. అయితే తాజాగా మీడియా అడిగిన ప్రశ్నకు నాగచైతన్య స్పందిస్తూ ఇలా సమాధానం ఇచ్చాడు.

ఈమధ్య ఆరు నెలల పాటు ఖాళీగా ఉన్నాను. అలా ఖాళీగా ఉండటం వల్ల పని పాట లేక జుట్టు, గడ్డం పెంచాను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అయితే వెంటనే సరైన సమాధానం ఇచ్చాడు చైతు. చందు మొండేటి డైరెక్షన్ లో రాబోతున్న సినిమా కోసమే నేను ఇలా మేకవర్ అవుతున్నానని.. మాస్ క్యారెక్టర్జేషన్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ఇలా జుట్టు, గడ్డం పెంచాలని వివరించాడు. ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు చైతు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గెటప్ లాక్ అయిందట‌.

ఆ గెటప్ తో ఫస్ట్ లుక్ ఫోటోషూట్ కూడా జరిగిందని చెప్పుకొచ్చాడు. ఫోటోషూట్ చాలా బాగా వచ్చిందని త్వరలోనే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్లు వివరించాడు. ఇక ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాస నేర్చుకుంటున్నాడట అక్కినేని హీరో. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన వర్క్ షాప్ జరుగుతుంది. డిసెంబర్ 9 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక మరికొద్ది రోజుల్లో చైతు పుట్టిన రోజు రాబోతుంది. ఆయన బర్త్డే కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారని టాక్.