సౌత్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా కొనసాగుతుంది నయనతార. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది. అయితే నయనతార స్టార్ హీరోయిన్గా ఈ స్టేజ్ కు రావడానికి ఆమె పడిన కష్టాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె అసలు పేరు ఏంటి.. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె ఏంచేసేది ఇలా ఆమె జర్నీ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.నయనతార నవంబర్ 18, 1984లో బెంగళూరు లో జన్మించింది. ఓ ఆర్థోడెక్స్ మలయాళీ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది నయనతార.
ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఈమె పేరు నయనతారగా మారింది. ఇక కేరళలో మార్తోమ కాలేజ్‌లో ఇంగ్లీష్ లిటరేచర్ డిగ్రీ పట్టాను అందుకుంది. ఇక నయనతార నటన రంగంలోకి అడుగుపెట్టకు ముందు పార్ట్ టైం మోడలింగ్ చేసింది. ఆమె మోడలింగ్ అసైన్మెంట్లను చూసి మనస్సి నక్కరే అనే సినిమాకు ఆమెను తీసుకున్నారు ఫిలిం మేకర్ సత్యం అంతికార్డ్. ఈ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నయన్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది.
ఇక 2011లో చెన్నైలోని ఆర్య సమాజ్ టెంపుల్లో నయనతార హిందూమతంలోకి వెళ్ళింది. దీని తర్వాతే ఆమె స్టేజ్ పేరు అసలు పేరుగా మార్చుకుంది. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ నయనతార కావడం విశేషం. ఆమె ఒక్క సినిమాకు రూ.12 – 15 కోట్ల వరకు పుచ్చుకుంటుందట. ఇక ఇటీవల జవాన్ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నటనతో కోట్లాదిమంది ఫాన్స్ ని సంపాదించుకున్న నయన్. ఈ సినిమాకు గాను తన కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ రూ.35 కోట్లను తీసుకున్నట్లు సమాచారం.
ఇక ఈమె రెండు దశాబ్దాలు సినీ కెరీర్‌లో 75 పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఏమీ నటనతోనే కాదు వ్యాపారంలోనే తన సత్తా చాటుతుంది. విగ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఈ బ్యానర్‌లో కోజంగల్, నేత్రికన్, కాతు వాకుల రెండు కాదల్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. ఇక 2016నుంచి విగ్నేష్ శివన్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న నయన్ 2022 జూన్ 9న గ్రాండ్గా వివాహం చేసుకుంది. ఇక ఈరోజు నయనతార తన 39 వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. దీంతో నయన్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు విషెస్ తెలియజేస్తున్నారు.