సినిమాలకు గుడ్ బై చెప్పేసి డాక్టర్ గా సెటి లైన స్టార్ డైరెక్టర్ కూతురు..!!

డైరెక్టర్ శంకర్ తెలుగు ప్రేక్షకులకు కోలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. తన దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతోమంది నటీనటులు సైతం చాలా ఆత్రుతగా ఉంటారు. ఎప్పుడూ కూడా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తూ ఉంటారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ కమలహాసన్ తో కలిసి భారతీయుడు-2 , రామ్ చరణ్ తో కలిసి గేమ్ చేంజర్ వంటి సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈయన కుమార్తె అదితి శంకర్ కూడా నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది.


తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది అదితి శంకర్. ఈమె సింగర్ గా కూడా మంచి పాపులారిటీ అందుకుంది.ఇప్పటికే వీరుమాన్,మావీరన్ వంటి సినిమాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం అదితి మరో రెండు సినిమాలలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈమె రెండేళ్ల క్రితమే మెడిసిన్ పూర్తి చేయడం జరిగిందట .అలా 2021 లో డాక్టర్ గా పట్టాను కూడా అందుకున్నట్లు తెలుస్తోంది.

Is Shankar's younger daughter actress Aditi Shankar getting married  suddenly? - Tamil News - IndiaGlitz.com

ఈ ఆనంద సమయంలో తన ఆనందాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో కూడా పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది. తాజాగా ఈ అమ్మడు డాక్టర్లు సర్జరీ చేసే సమయంలో ధరించి దుస్తులను ధరించి మాస్కు పెట్టుకుని అదితి DR.A అని క్యాప్షన్ను రాసుకు రావడం జరిగింది దీంతో పలువురు నెటిజన్ల సైతం అదితి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి డాక్టర్ గా సెటిలైపోయిందా అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇదంతా నిజంగానే అయితే ఇక ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పి డాక్టర్ వృత్తిలోనే కొనసాగించబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.