పెళ్లి చేసుకోబోతున్న సీరియల్ నటుడు మనస్…!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు మానస్ నాగులపల్లి. బాలనటుడిగా వెండితెర పై అడుగుపెట్టిన మానస్, తరువాత ప్రేమికుడు చిత్రం ద్వారా వెండితెర పై హీరోగా పరిచయమయ్యాడు. ఆ తరువాత క్షీర సాగర మధనం, గోళీసోడా, గ్యాంగ్ అఫ్ గబ్బర్ సింగ్, కాయ్ రాజా కాయ్ చిత్రాలలో కూడా నటించాడు. ఐతే ఈ సినిమాలు అనుకున్న స్థాయి విజయాలు సాధించలేదు. దాంతో బుల్లితెర పై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఈ కుర్ర హీరో. కోయిలమ్మ సీరియల్ ద్వారా బుల్లితెర పై ప్రవేశించాడు. బుల్లితెర పై మానస్ కు మంచి ఆదరణ లభించింది. సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన మానస్, ఆ తరువాత బిగ్ బాస్ సీజన్లో 5 లో కూడా పాల్గొన్నాడు. మానస్ ప్రస్తుతం దీపారాధన, బ్రహ్మముడి సీరియల్స్ లో నటిస్తున్నాడు. బ్రహ్మముడి సిరియాలో రాజ్ గా మానస్ నటన అందర్నీ ఆకట్టుకుంది.

తన విలక్షణ నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న మానస్ కు ఈ మధ్యే నిశ్చితార్ధం అయింది. అతనికి కాబోయే భార్య పేరు శ్రీజ. ఈ మధ్యే ఒక బుల్లితెర కార్యక్రమంలో తన భార్యను అందరికి పరిచయం చేసాడు కూడా. స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో భాగంగా ఒక ముఖ్యమైన అవార్డు అందుకున్నాడు మానస్. అతని అద్భుతమైన నటనకు గాను అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ మేల్ విభాగంలో ఈ అవార్డు అందుకున్నాడు మానస్. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు కాబోయే జీవిత భాగస్వామిని అందరికి పరిచయం చేసాడు మానస్. వారిది పెద్దలు కుదిర్చిన వివాహమని చెప్పాడు మానస్.

తాను ఎల్లప్పుడూ తనను అర్ధం చేసుకునే అమ్మాయి తనకు భార్యగా రావాలని కోరుకున్నానని, శ్రీజలో ఆ లక్షణాలన్నీ ఉన్నాయని, అందుకే ఈ వివాహానికి అంగీకరించానని చెప్పాడు మానస్. అదే సమయంలో తన వివాహ దినాన్ని కూడా ప్రకటించాడు. నవంబర్ 22 న తమ పెళ్ళికి పెద్దలు ముహూర్తం నిశ్చయించారని అందరి సమక్షంలో తెలిపాడు మానస్.