న్యూ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించిన అక్కినేని హీరో…!?

అభిమానులతో ఎల్లప్పుడూ సత్సంబంధాలతో మెలుగుతుంటారు మన హీరోలు. అందుకే…వారితో టచ్ లో ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయంలో వారికి సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు ఈ తరం హీరోలు. ఎప్పటికప్పుడు తమ సినిమాల గురించి, తమ జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారానో, లేక ఎక్స్ ద్వారానో పోస్ట్లు పెడుతూవుంటారు. మరికొందరైతే ఏకంగా యు ట్యూబ్ చానెల్స్ కూడా ప్రారంభించేసారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిపోయాడు మన అక్కినేని వారసుడు నాగ చైతన్య.

ఈ సంవత్సరం కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య, ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఒకవైపు తన ప్రొఫెషనల్ కెరీర్ ను విజయవంతంగా నడుపుతూనే, మరోవైపు ఒక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించాడు మన యువ సామ్రాట్. “అక్కినేని నాగ చైతన్య” పేరుతో ఛానెల్ స్టార్ట్ చేసిన చైతు, శుక్రవారం ఒక వీడియో కూడా పోస్ట్ చేసాడు. యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగు పెట్టనంటూ తన అభిమానులకు వెల్లడించాడు. వెంటనే ప్రశ్నల వర్షం కురిపించారు అభిమానులు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చాడు చైతు. “ఇలా జుట్టు గడ్డం పెంచడానికి కారణం ఏమిటి..?” అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు, ఆరు నెలలుగా పని లేదని, ఇంట్లో ఖాళీగా ఉంటూ ఏం చెయ్యాలో తోచక ఇలా జుట్టు,గడ్డం పెంచుతున్నానని సరదాగా సంధానం ఇచ్చాడు నాగ చైతన్య. ఐతే ఆ తరువాత చందు మొండేటి దర్శకత్వంలో తానూ చేస్తున్న తదుపరి చిత్రం కోసమే జుట్టు పెంచానని చెప్పుకొచ్చాడు చైతు.

NC23 పేరుతో తెరకెక్కుతున్న నాగ చైతన్య తదుపరి చిత్రం ఒక ఫిషర్ మాన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో అమెజాన్ ప్రైమ్ కోసం ఒక ప్రాజెక్ట్ లో నటించారు చైతన్య. ఈ చిత్రానికి “దూత” టైటిల్ ను నిశ్చయించినట్టు వెల్లడించారు మేకర్స్. ఈ చిత్రం డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అందుబాటులో ఉంటుంది.